Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్

Lalu Prasad Yadav's Health Condition Updates: ఆర్జేడీ పార్టీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ ఆరోగ్యం విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Written by - Pavan | Last Updated : Jul 7, 2022, 12:14 AM IST
Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్

Lalu Prasad Yadav's Health Condition Updates: ఢిల్లీ: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని ఎయిర్ అంబులెన్సులో పాట్నా నుంచి ఢిల్లీకి తరలించారు. గత కొద్ది రోజులుగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించడంతో మెరుగైన అత్యవసర చికిత్స కోసం హుటాహుటిన రాత్రి 8.15 గంటలకు ఢిల్లీకి తరలించారు. కూతురు, రాజ్యసభ సభ్యురాలైన డా మిశా భారతితో పాటు ఇంకొంత మంది డాక్టర్ల బృందం ఆయన వెంట వెళ్లింది. లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి, చిన్న కొడుకు తేజస్వి యాదవ్ అంతకంటే కొన్ని గంటల ముందే ఢిల్లీకి వెళ్లి అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. 

లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం నుండి పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని ఢిల్లీకి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న ఆర్జేడీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పరాస్ ఆస్పత్రికి చేరుకున్నారు.

పరాస్ హాస్పిటల్ నుంచి పాట్నా ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలోనూ మద్దతుదారులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి తమ నేతను చూసేందుకు పోటీపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కోలుకోవాలని నినాదాలు చేస్తూ ఆ కుటుంబానికి తమ మద్దతు తెలియజేశారు.

Also read : Agnipath Recruitment Scheme-2022: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు విశేష స్పందన..రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్..!

Also read : Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..కీలక సూచనలు చేసిన వాతావరణ శాఖ..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News