Lakhimpur Kheri Violence: లఖీంపూర్ ఖేరీ మృతులకు 45 లక్షల పరిహారం, యూపీ ప్రభుత్వ హామీ

Lakhimpur Kheri Violence: ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరి ఘటన కొలిక్కి వచ్చింది. ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. పరిహారం విషయమై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హామీతో ఆందోళన సద్దుమణిగింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 4, 2021, 03:39 PM IST
  • సద్దుమణిగిిన లఖీంపూర్ ఖేరీ ఆందోళన, ప్రభుత్వానికి రైతులకు మద్య చర్చలు సఫలం
  • మృతి చెందిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారం, గాయపడినవారికి పది లక్షలు
  • మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
Lakhimpur Kheri Violence: లఖీంపూర్ ఖేరీ మృతులకు 45 లక్షల పరిహారం, యూపీ ప్రభుత్వ హామీ

Lakhimpur Kheri Violence: ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరి ఘటన కొలిక్కి వచ్చింది. ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. పరిహారం విషయమై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హామీతో ఆందోళన సద్దుమణిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరిలో రైతుల ఆందోళన(Farmers Protest)హింసాత్మక ఘటనలు, చర్చల అనంతరం కొలిక్కి వచ్చింది. రైతులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కేంద్రహోంశాఖ సహాయమంత్రి, ఎంపీ అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు యూపీలోని బన్బీర్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి వెంట అతని కుమారుడు ఆశిష్ కూడా అదే కాన్వాయ్‌లో ఉన్నారు. మంత్రులు తిరిగి బయలుదేరి వెళ్లేటప్పుడు భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన కొందరు రైతులు నల్లజెండాలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. టికోనియా-బన్బీర్‌పూర్ రోడ్డులో కాన్వాయ్ వెంట నినాదాలిచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఓ వాహనం అక్కడున్న రైతులపై దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పాయారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన రైతులు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారుల దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్ మరణించారు. తరువాత ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు కూడా మరణించాడు. 

దాంతో ఆందోళన బాట పట్టిన రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. లఖీంపూర్ ఖేరీలో(Lakhimpur kheri)మృతి చెందిన రైతుల కుటుంబాలకు 45 లక్షల రూపాయలు(45 Lakhs Exgratia), గాయపడినవారికి 10 లక్షల రూపాయలు ఇస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపింది. 

Also read: Electric Vehicles Charging: ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News