కర్ణాటక అసెంబ్లీలో బల పరీక్షకు ముహూర్తం ఖరారు

కర్ణాటక అసెంబ్లీలో బల పరీక్షకు ముహూర్తం ఖరారు

Last Updated : Jul 15, 2019, 03:28 PM IST
కర్ణాటక అసెంబ్లీలో బల పరీక్షకు ముహూర్తం ఖరారు

బెంగళూరు: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుండి కష్టాలపాలైన సంగతి తెలిసిందే. దాదాపు వారం, పది రోజుల నుంచి ముంబై, బెంగళూరు కేంద్రాలుగా నడుస్తున్న ఈ పొలిటికల్ డ్రామాకు ఈ నెల 18వ తేదీన తెరపడనుంది. అవును, బీజేపి పట్టుబడుతున్నట్టుగా 18వ తేదీన ఉదయం 11 గంటలకు బల పరీక్ష నిర్వహించేందుకు కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఓకె చెప్పారు. బల పరీక్షకు సిద్ధం కావాల్సిందిగా స్పీకర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించి తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతలు నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తన వంతు కృషి తాను చేస్తున్నారు. లేదంటే తమ రెండు పార్టీలు కలిసి పంచుకుంటున్న అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Trending News