Kolkata Murder Case: కోల్ కతా ఘటనలో మరో సంచలనం.. సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విధించిన కోర్టు..

Rg kar murder case: ఆర్జీకర్ ఘటనలో  కోల్ కతా కోర్టు  తుది శిక్షను ఖరారు చేసింది. జూనియర్ డాక్టర్ ఘటనలో ఇప్పటికే సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తెల్చింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 20, 2025, 03:52 PM IST
  • కోల్ కతా ఘటనలో కీలక తీర్పు..
  • నిందితుడికి జీవిత ఖైదీ..
Kolkata Murder Case: కోల్ కతా ఘటనలో మరో సంచలనం.. సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విధించిన కోర్టు..

Kokata court verdict on rg kar case: ఆర్జీకర్ ఘటనలో కోల్ కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  నిందితుడు సంజయ్ రాయ్ కు కోర్టు.. శిక్షను ఖరారు చేస్తు తీర్పును వెల్లడించింది. జూనియర్ డాక్టర్ ఘటనలో  కోర్టు.. నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్షను విధించింది.

అంతేకాకుండా.. రూ. 50 వేల జరిమాన సైతం విధించింది. ఈ నెల 18న కోర్టు సంజయ్ రాయ్ ను దోషిగా తెల్చింది. ఈ క్రమంలో దేశంలో నెలకొన్న ఉత్కంఠకు ప్రస్తుతం తెరపడిందని చెప్పుకొవచ్చు.  గతేడాది ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటన తర్వాత యావత్ దేశంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. దేశ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు.

ఈ క్రమంలో దీనిపై జూనియర్ డాక్టర్ లు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ తీరును నిరసిస్తు నెలల తరబడి తమ నిరసనలువ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు చాలా నెగ్లీజెన్సీగా ప్రవర్తించారని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  గతంలో ఘటన జరిగిన ప్రదేశంలో ఘటన దగ్గర ఆనవాళ్లు చెరిగిపోకుండా.. ఇతరులు ప్రవేశించకుండా.. జాగ్రత్తగా పడంతో పోలీసులు విఫలమయ్యారని కోర్టు వాదించింది.

Read more:  Sharon Raj Case: కేరళ షరోన్ రాజ్ హత్య కేసు.. సంచలన తీర్పు వెలువరించిన న్యాయస్థానం..

ఘటన జరిగాక.. వందలాది మంది అల్లరి మూకలు ఆర్జీకర్ ఆస్పత్రిలో చేరుకుని విధ్వంసానికి పాల్పడ్డారు. ఈక్రమంలో దీనిపై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.  ఈ కేసులో ప్రస్తుతం సంజయ్ రాయ్ , సందీప్ ఘోష్,  పోలీసు అధికారి అభిజిత్ మండల్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం సందీప్ ఘోష్, అభిజిత్ మండల్ బెయిల్ మీద ఉన్నారు.  ఈ క్రమంలో కోల్ కతా కోర్ట్ సంజయ్ రాయ్ కు విధించిన పనిష్మెంట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News