Kerala woman dies due to food-poisoning after Eating 'Kuzhimanthi': రెస్టారెంట్లలోని కలుషిత ఆహారం ఇప్పుడు కేరళలో మరో ప్రాణాన్ని బలిగొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే కాసరగోడ్‌లోని చెమ్నాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని తలక్లాయి గ్రామానికి చెందిన అంజు శ్రీ పార్వతి ఏడు రోజులుగా ఫుడ్ పాయిజన్ లక్షణాలతో పోరాడుతూ శనివారం అంటే ఈరోజు జనవరి 7 తెల్లవారుజామున మరణించింది. ఆమె వయసు 19 సంవత్సరాలు మాత్రమే.
ఇక ప్రభుత్వం స్పందించడంతో ఈ ఘటనకు సంబంధించి హోటల్ యజమాని సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె డిసెంబర్ 31న కాసరగోడ్ పట్టణంలోని అద్కత్‌బైల్‌లోని అల్ రోమన్సియా రెస్టారెంట్ నుండి ఒక ఫుల్ చికెన్ కుజిమంతి, ఒక ఫుల్ చికెన్ 65, మయోనైస్ ఆలాగే సలాడ్‌ని ఆర్డర్ చేసినట్లు తలక్లై వార్డు మెంబర్ రేణుకా భాస్కరన్ తెలిపారు. మధ్యాహ్న భోజనం కోసం ఆమె ఈ ఫుడ్ ఆర్డర్ చేసుకోగా ఆమెకు ఆ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఇంటికి డెలివరీ చేయబడింది.
ఈ ఫుడ్ ను అంజు శ్రీ పార్వతి అలాగే మరో ముగ్గురు తిన్నారు. అంజుశ్రీ తల్లి అంబిక, ఆమె సోదరుడు శ్రీకుమార్ (18), అలాగే ఆమె బంధువులు శ్రీ నందన కూడా ఈ ఫుడ్ తినగా అందరికీ అనారోగ్యం ఏర్పడింది అని రేణుక అన్నారు. ఇక అంజు శ్రీ పార్వతి మంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంజు శ్రీ పార్వతితో కలిసి భోజనం చేసిన ఆమె ఫ్యామిలీ కూడా ఫుడ్ పాయిజన్ కు గురైంది.
ఆమె బంధువులు మేళపరంబ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజుశ్రీకి ఎక్కువగా వాంతులు అవుతున్నాయని, జనవరి 1న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. అంజుశ్రీ మంజేశ్వర్‌లోని గోవింద పాయ్ మెమోరియల్ ప్రభుత్వ కళాశాలలో బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె డిసెంబర్ 23 నుండి 29 వరకు క్యాంపస్‌లో ఎన్‌ఎస్‌ఎస్ క్యాంప్‌కు కుడా హాజరయ్యింది.
జనవరి 3న కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాలలో నర్సు రేష్మీ రాజ్ ఫుడ్ పాయిజనింగ్ వలన చనిపోయిన మూడు రోజుల తర్వాత అంజుశ్రీ మరణించింది. కుజిమంతి అనేది చికెన్ (లేదా ఏదైనా మాంసం), మసాలా మిక్స్, బియ్యంతో కూడిన ప్రసిద్ధ వంటకం, దీనిని భూగర్భ ఓవెన్‌లో నెమ్మదిగా వండుతారు.
ఇక ఆ రెస్టారెంట్లో అదే ఆహారాన్ని తినడం వల్ల మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక ఆమె మరణం తర్వాత, కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెస్టారెంట్లు మరియు తినుబండారాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. రేష్మీ రాజ్ మరణించిన రోజున 429 రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వాటిలో పరిశుభ్రత పాటించని 22 రెస్టారెంట్లు, లైసెన్స్ లేని 21 రెస్టారెంట్లను మూసివేయాలని కూడా డిపార్ట్‌మెంట్ ఆదేశించింది.
Also Read: Balakrishna Helicopter: బాలయ్యకి తప్పిన పెను ప్రమాదం.. హెలికాఫ్టర్ ఎమర్జన్సీ లాండింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook