Kerala: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్..! ఎలాగో తెలుసా?

Lottery: అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి..రాత్రికి రాత్రే కోటీశ్వరుడై పోయాడు ఓ ఆటో డ్రైవర్. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2021, 03:13 PM IST
  • ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం
  • రూ. 12కోట్లు లాటరీ
  • కేరళలో ఘటన
Kerala: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్..! ఎలాగో తెలుసా?

Lottery: ఓనం పండుగ సందర్భంగా లాటరీ పెట్టారు.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి.. ఏదో ఆశగా ఓ లాటరీ టికెట్‌ కొన్నాడు.. కానీ అదృష్టం తన తలుపుతడుతుందని అస్సలు ఊహించలేదు.. కట్‌చేస్తే.. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. కేరళ(Kerala)కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు లాటరీలో రూ.12 కోట్ల బహుమతి లభించింది. 

ఓనం పర్వదినం సందర్భంగా నిర్వాహాకులు.. తిరుఓనం బంపర్‌ లాటరీ(Bumper Lottery) ఫలితాలను ఆదివారం ప్రకటించారు. ఈ లాటరీ ఫలితాల్లో టీఈ-645465 నంబరు టికెట్‌ బంపర్‌ బహుమతికి ఎంపిక అయింది. ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన అదృష్టవంతుడు కేరళ ఎర్నాకుళం జిల్లాలోని మరాడుకి చెందిన ఆటో డ్రైవర్‌(Auto Driver) పీఆర్‌ జయపాలన్ అని సోమవారం నిర్ధారణ అయింది.

Also Read: LIC అదిరిపోయే పాలసీ.. రూ.233 పొదుపుతో మీ చేతికి రూ.17 లక్షలు!

ఆటో డ్రైవర్ అయిన జయపాలన్ (Jayapalan) తన లాటరీ టికెట్‌ను తీసుకొని మరాడు కెనరా బ్యాంక్‌కు వెళ్లగా.. బ్యాంకు సిబ్బంది, అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. లాటరీ విజేతను తానేనంటూ అక్కడున్న వారికి ఆటో డ్రైవర్‌ జయపాలన్‌ తెలిపాడు. ఈ లాటరీ టికెట్‌ను సెప్టెంబరు 10న త్రిప్పునితురలో కొనుగోలు చేసినట్లు జయపాలన్‌ తెలిపాడు. ఫాన్సీ నంబర్‌గా ఉన్న టికెట్‌ను తానే కొన్నానని.. దానితోపాటు.. వేరే టికెట్లను కూడా కొనుగోలు చేసినట్లు జయపాలన్‌ తెలిపాడు. ఆదివారం వార్తలు చూస్తున్న క్రమంలో మొదటి బహుమతి గెలుచుకున్న విషయం తెలిసిందని తెలిపాడు.

ఈ నంబర్‌కు బహుమతి లభిస్తుందని టికెట్‌ కొన్నప్పుడే భావించానని.. సంతోషం వ్యక్తంచేశాడు. అయితే.. లాటరీ సంఖ్యను నిర్ధారించిన తర్వాత మాత్రమే బంధువులకు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించాడు. కాగా.. రూ.12 కోట్ల బహుమతి మొత్తంలో అన్నిరకాల పన్నులను మినహాయించగా మిగతా మొత్తం అతనికి దక్కుతుందని బ్యాంకు సిబ్బంది వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News