Kamal Haasan: ఎంపీ ఎన్నికలకు కమల్ హాసన్ రాంరాం.. డీఎంకే పార్టీతో కుదిరిన పొత్తు

లోక్‌సభ ఎన్నికల సమయం ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకేకు మద్దతునిచ్చారు. మద్దతునిచ్చిన కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో 2025 రాజ్యసభ ఎన్నికల్లో కమల్‌హాసన్‌ పార్టీకి ఓ సీటు ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కమల్‌ హాసన్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సమావేశమయ్యారు. కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 10, 2024, 09:48 AM IST
Kamal Haasan: ఎంపీ ఎన్నికలకు కమల్ హాసన్ రాంరాం.. డీఎంకే పార్టీతో కుదిరిన పొత్తు

Kamal Haasan DMK Alliance: లోక్‌సభ ఎన్నికల సమయం ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకేకు మద్దతునిచ్చారు. మద్దతునిచ్చిన కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో 2025 రాజ్యసభ ఎన్నికల్లో కమల్‌హాసన్‌ పార్టీకి ఓ సీటు ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కమల్‌ హాసన్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సమావేశమయ్యారు. కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు.

Also Read: Mizoram Speaker: యాంకర్‌ నుంచి స్పీకర్‌గా.. మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎంఎన్‌ఎం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తెలిపారు. కూటమికి పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పారు. డీఎంకే కూటమితో చేతులు కలిపింది పదవుల కోసం కాదని దేశం కోసమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయకున్నా లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వెల్లడించారు.

Also Read: KN Rajannna: జై పాకిస్థాన్‌ అనే కొడుకుల్ని కాల్చి చంపాలి: మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇక ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి టికెట్లు కేటాయించింది. తమిళనాడులో ఉన్న మొత్తం 40 సీట్లలో 21 స్థానాల్లో డీఎంకే పార్టీ పోటీ చేయనుంది. కాంగ్రెస్‌ పది సీట్లలో, సీపీఐ, సీపీఎం, వీసీకేకు  రెండేసి సీట్ల చొప్పున కేటాయించింది. ఎండీఎంకే, ఐయూఎంఎల్‌, కేఎండీకేకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించారు. సీట్ల ఒప్పందం తర్వాత ఇండియా కూటమి ప్రతినిధులు మాట్లాడారు. మొత్తం 40 సీట్లలో తమ పార్టీ సభ్యులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News