కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో తేల్చిచెప్పిన దేవేగౌడ

కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో తేల్చిచెప్పిన దేవేగౌడ

Last Updated : May 18, 2019, 03:43 PM IST
కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో తేల్చిచెప్పిన దేవేగౌడ

లోక్ సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కేంద్రంలో తమ మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత దేవేగౌడ స్పందించారు. బీజేపి మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ పార్టీకే మ పార్టీ మద్దతు ఇస్తుందని దేవేగౌడ స్పష్టంచేశారు. ఈ విషయంలో ఇంతకుమించి మాట్లాడటం తనకు ఆసక్తి లేదని దేవేగౌడ తేల్చిచెప్పారు. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు లభిస్తాయనే స్పష్టత వచ్చేది ఆరోజే కనుక అప్పటి వరకు వేచిచూడక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.

నేడు తన పుట్టిన రోజు సందర్భంగా తనయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవేగౌడ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News