జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్‌లో భారత భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బదిగం ప్రాంతంలో భారత భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
చనిపోయిన వారిని సద్దాం పద్దర్, డా.మహమ్మద్ రఫీక్ భట్, బిలాల్ మౌల్వి, ఆదిల్ మాలిక్, తవ్సీఫ్ షేక్‌గా గుర్తించారు. డా.భట్ సోషియాలజీలో పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డీజీపీ ఎస్పీ వైద్ మాట్లాడుతూ 'భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య షోపియాన్ బదిగం ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ ను ఆపేశాం' అన్నారు.
Encounter concluded at Badigam, Zainpora in Shopian, 5 bodies of terrorists recovered: SP Vaid, Director General of Police, Jammu & Kashmir (File pic) pic.twitter.com/CIm8FaEhyE
— ANI (@ANI) May 6, 2018
సద్దామ్ పద్దర్ అనే హిజ్బుల్ కమాండర్‌ను భట్ కలవడానికి వచ్చిన సంగతిని పసిగట్టిన భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. దీంతో భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. శ్రీనగర్‌లోని ఛట్టాబల్ ఏరియాలో శనివారం ముగ్గురు మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతాసిబ్బందికి (అధికారితో కలిపి) గాయాలయయ్యని సీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు.