Jamili Elections in Telugu: దేశమంతా ఇప్పుడు జమిలి ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. జమిలి ఎన్నికలంటే దేశంలో ఒకే ఎన్నికలు. అంటే అటు లోక్‌సభ, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం. ఇదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీనిని ఇవాళ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఇక రెండు ప్రక్రియలు మిగిలున్నాయి. ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడం. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. బిల్లు అమల్లో రావాలంటే రాజ్యాంగంలోని ఆరు ఆర్టికల్స్ సవరణ చేయాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లో రావాలంటే చేయాల్సిన రాజ్యాంగ సవరణలు ఇవీ..
1. లోక్‌సభ, రాజ్యసభ కాల పరిమితి చెందిన ఆర్టికల్ 83, రాష్ట్రాల అసెంబ్లీకు ఐదేళ్ల గడువుని నిర్దేశించే ఆర్టికల్ 172(1) సవరణ
2. ఎమర్జెన్సీ పరిస్థితులొస్తే సభ కాల పరిమితిని ఏడాది దాటకుంటా వీలు కల్పించే ఆర్టికల్ 83(2) సవరణ
3. లోక్‌సభను రద్దు చేసేలా రాష్ట్రపతికి అధికారాలిచ్చే ఆర్టికల్ 85(2) సవరణ
4. రాష్ట్రాల అసెంబ్లీ రద్దు అధికారాన్ని గవర్నర్‌కు ఇచ్చే ఆర్టికల్ 174(2) సవరణ
5. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 సవరణ
6. ఎన్నికల కమీషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324 సవరణ
దేశంలో ఇప్పటి వరకూ అంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1957, 1962, 1967లో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత పరిస్థితులు మారి అడపా దడపా జరుగుతున్నాయి. జమిలి ఎన్నికల ప్రతిపాదన తొలిసారిగా 1980లో వచ్చింది. ఆ తరువాత 1999లో లా కమీషన్ కూడా జమిలి ఎన్నికలకు ఓకే చెప్పింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడంతో పాటు ఆరు ఆర్టికల్స్ సవరించాల్సి ఉంది. ఆ తరువాత సగం రాష్ట్రాలు ఓకే చెప్పాల్సి ఉంది. అన్నీ అనుకూలిస్తే 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది.
Also read: AP Politics: వైసీపీలో ఏం జరుగుతోంది, వరుసగా నేతల రాజీనామాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.