Insacag Report: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెల్లడైంది. దేశంలో ఒమిక్రాన్ పరిస్థితిపై ఇన్సాకాగ్ ఇచ్చిన నివేదిక ఆందోళన కల్గిస్తోంది.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచమంతా విస్తరించింది. మరోవైపు ఇండియా కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. దేశంలో సైతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియన్ సార్స్‌కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం స్థూలంగా చెప్పాలంటే ఇన్సాకాగ్ ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికే ఇప్పుడు ఆందోళన రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని ఇన్సాకాగ్ వెల్లడించింది. దేశంలో అంతర్గతంగా ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) వ్యాప్తి అధికంగా ఉందని ఇన్సాకాగ్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
గత 24 గంటల్లో దేశంలో మొత్తం 3 లక్షల 33 వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 21 లక్షల 87 వేలకు పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ తరువాత కరోనా యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉండటం ఇదే. గత 24 గంటల్లో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 525 మంది మరణించారు. వీరిలో అత్యదికంగా కేరళ నుంచి 132 మంది, మహారాష్ట్ర నుంచి 48 మంది ఉన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ సోకినా సరే చాలామందిలో వైరస్ లక్షణాలు కన్పించడం లేదు. ఇంకొందరిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. ఒమిక్రాన్ సంక్రమణ తీవ్రత అధికంగానే ఉన్నా..ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్‌తో ప్రాణాపాయం కూడా తక్కువేనని ఇన్సాకాగ్ నివేదికలో (Insacag Report) ఉంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని..అప్రమత్తత అవసరమని స్పష్టం చేసింది.
Also read: New Variant found in Britain: దీనికి అంతం లేదు మిత్రమా.. బ్రిటన్‌లో వెలుగులోకి కొత్త వేరియంట్ BA.2
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook