Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి తీవ్ర స్థాయిలో విలయతాండవం చేస్తోంది. నిరంతరం రికార్డుస్థాయిలో కేసులు, మరణాల సంఖ్య నమోదవుతోంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 40లక్షలకు చేరువలో ఉంది. గత 24 గంటల్లో గురువారం ( సెప్టెంబరు 3న ) దేశవ్యాప్తంగా కొత్తగా రికార్డుస్థాయిలో 83,341 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,096 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,36,748కి చేరింది. దీంతోపాటు మరణాల సంఖ్య 68,472కి పెరిగింది. Also read: విశాఖపట్నం వచ్చినప్పుడు కలుస్తానమ్మా: పవన్ కల్యాణ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,31,124 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 30,37,152 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 11,69,765 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. సెప్టెంబరు 3 వరకు మొత్తం 4,66,79,145 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: No Time To Die: దుమ్మురేపుతున్న జేమ్స్‌బాండ్ సరికొత్త ట్రైలర్