భారత్‌లో టాప్ 10 కుబేరులు వీళ్లే...

Last Updated : Oct 6, 2017, 02:09 PM IST
భారత్‌లో టాప్ 10 కుబేరులు వీళ్లే...

 ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్  ఫోర్బ్స్ భారతదేశంలోని టాప్ 100 కుబేరుల జాబితా విడుదల చేసింది. తాజా జాబితాలో మరోసారి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్ షేర్లు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈసారి కూడా ముఖేష్ కుబేరుల జాబితాలో చోటును పదిలం చేసుకున్నారు. ఆయన సంపద గతేడాదితో పోలిస్తే 67 శాతం పెరిగింది. ఆసియా ఖండంలో ఐదు మంది అత్యంత సంపన్నుల జాబితాలో కూడా ముఖేష్ చోటు సంపాదించారు. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో వరుసగా 10 సార్లు టాప్ -1 ముఖేష్ అంబానీ నిలబడటం విశేషం.  ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో  విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ రెండవ స్థానం, మూడవ స్థానంలో అశోక్ లేలాండ్ అధినేతలు హిందుజా బ్రదర్స్, లక్ష్మి మిట్టల్, పల్లోంజీ మిస్త్రీలు వరుసగా నాల్గు, ఐదవ స్థానాల్లో ఉన్నారు. 

 

టాప్ 10 సంపన్నుల జాబితా : 

* ముఖేష్ అంబానీ ఆస్తి విలువ: 38 బిలియన్ డాలర్లు ( రూ. 2 లక్షల 48 వేల కోట్లు)

* అజిం ప్రేమ్ జీ ఆస్తి విలువ :  19 బిలియన్ డాలర్లు  ( రూ. లక్షా 24 వేల కోట్లు )

* హిందుజా ఫ్యామిలీ ఆస్తి విలువ :   18.4 బిలియన్ డాలర్లు ( రూ. లక్షా 20 వేల కోట్లు )

* లక్ష్మీ మిట్టల్ ఆస్తి విలువ : 16.4  బిలియన్ డాలర్లు ( రూ. లక్షా ఏడు వేల కోట్లు )

* పొలంగి మిస్త్రి  ఆస్తి విలువ : 16  బిలియన్ డాలర్లు  ( రూ. లక్షా 4 వేల కోట్లు )

*గోద్రెజ్ ఫ్యామిలీ ఆస్తి విలువ :14.2 బిలియన్ డాలర్లు ( రూ. 92 వేల కోట్లు )

* శివ్ నాదర్ ఆస్తి విలువ :13.6 బిలియన్ డాలర్లు ( రూ. 89 వేల కోట్లు )

* కుమార్ మంగళం ఆస్తి విలువ :12.6 బిలియన్ డాలర్లు (82 వేల కోట్లు )

* దిలీప్ సంఘ్వీ ఆస్తి విలువ:  12.1 బిలియన్ డాలర్లు ( 79 వేల కోట్లు )

* గౌతం అదానీ : 11 బిలియన్ డాలర్లు (  72 వేల కోట్లు )

 

Trending News