Earth Quake: ఇండియాలో వరుసగా మరోసారి మరో ప్రాంతంలో భూమి కంపించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం కలకలం సృష్టించింది. ఇవాళ తెల్లవారుజూమున సంభవించిన భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. ఏ మేరకు నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
భారతదేశం సముద్ర భాగంలో ఉన్న అండమాన్, నికోబార్ దీవులు ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉదయం 5 గంటల 31 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం తీవ్రత అండమాన్ నికోబార్ ప్రాంతంలో 100 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. వరుసగా నాలుగోసార ఇండియాలో భూకంపం సంభవించడం. నిన్న జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో(4.3 Magnitude) భూమి కంపించింది. అంతకుముందు డిసెంబర్ 26వ తేదీన హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో 2.8 తీవ్రత నమోదు కాగా, మణిపూర్‌లో 3.5 తీవ్రత నమోదైంది.
Earthquake of Magnitude:4.3, Occurred on 29-12-2021, 05:31:05 IST, Lat: 10.26 & Long: 93.34, Depth: 100 Km ,Location: 165km SSE of Portblair, Andaman and Nicobar island, India for more information download the BhooKamp App https://t.co/g71tc80UpZ pic.twitter.com/Z3B89IwuBJ
— National Center for Seismology (@NCS_Earthquake) December 29, 2021
ఇక ఇవాళ తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman Nikobar Islands Earthquake) సంభవించిన భూకంపానికి సంబంధించి ఆస్థి, ప్రాణ నష్టంపై ఇంకా వివరాలు అందాల్సి ఉన్నాయి. ఇవాళ ఉదయం 5 గంటల 31 నిమిషాలకు 4.3 తీవ్రతతో 10.26 లాటిట్యూడ్, 93.34 లాంగిట్యూడ్‌లో పోర్ట్ బ్లెయిర్‌కు 165 కిలోమీటర్ల దూరంలో..100 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
Also read: Corona Booster Dose: కరోనా బూస్టర్ డోసు ఎవరికి, ఎప్పుడు, కొత్త మార్గదర్శకాలు జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి