India witnessed rise in daily COVID-19 cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మరణాలు భారీగా పెరిగాయి.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,774 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) తెలిసింది. మొత్తం 10,91,236 శాంపిళ్లను టెస్టు చేయగా ఈ కేసులు బయపడ్డట్లు ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది.
ఇదే సమయంలో కొవిడ్ కారణంగా మరో 612 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 9,481 మంది కొవిడ్ నుంచి తేరుకున్నారు.
మరిన్ని వివరాలు..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,05,691 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,68,554 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.36 శాతంగా ఉంది.
ఇప్పటి వరకు దేశంలో 34,572,523 మందికి కరోనా సోకగా.. అందులో 3,39,98,278 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.34 శాతంగా ఉంది. దీనితో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 543 రోజుల కనిష్ఠానికి పడిపోయింది.
వ్యాక్సినేషన్ ఇలా..
నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 82,86,058 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,21,94,71,134 వద్దకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 261,393,951 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,213,454 మంది మహమ్మారికి బలయ్యారు. 236,106,505 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 20,073,992 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
అమెరికాలో కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే బ్రిటన్, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీలో మాత్రం కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. పోలాండ్, నెందర్లాండ్స్, చెక్ రిపబ్లిక్, బెల్జియంలో కూడా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి.
ఒమిక్రాన్ వణికిస్తోంది..
దాదాపు రెండేళ్లుగా ప్రపంచప దేశాలని వివిధ కరోనా వేరియంట్లు భయపెడుతుండగా.. కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) ఆందోళనలు మరింతి పెంచింది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ కేసులను కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు చర్యలు ప్రారంభించాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షు విధిస్తున్నాయి. ఇప్పటికి వచ్చిన వారిన క్వారంటైన్లకు పంపుతున్నారు అధికారులు.
Also read: Road accident: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-18 మంది మృతి
Also read: భారీ వర్షాలతో వరద ముంపులో తమిళనాడు దృశ్యాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook