'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఎగుమతిపై పాక్షికంగా నిషేధం ఎత్తివేత

'కరోనా వైరస్' మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఔషధం 'హైడ్రాక్సీక్లోరోక్విన్'. ప్రస్తుతం ఈ ఒక్క ఔషధం మాత్రమే గేమ్ చేంజర్ గా ఉంది. అంటే దీని ద్వారా కరోనా వైరస్ లొంగి వస్తోంది. ఫలితంగా ఈ ఔషధాన్ని తయారు చేస్తున్న భారత్ వైపు అన్ని దేశాల చూపు నెలకొంది.

Last Updated : Apr 7, 2020, 11:28 AM IST
'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఎగుమతిపై పాక్షికంగా నిషేధం ఎత్తివేత

'కరోనా వైరస్' మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఔషధం 'హైడ్రాక్సీక్లోరోక్విన్'. ప్రస్తుతం ఈ ఒక్క ఔషధం మాత్రమే గేమ్ చేంజర్ గా ఉంది. అంటే దీని ద్వారా కరోనా వైరస్ లొంగి వస్తోంది. ఫలితంగా ఈ ఔషధాన్ని తయారు చేస్తున్న భారత్ వైపు అన్ని దేశాల చూపు నెలకొంది. 

అగ్రరాజ్యం అమెరికా సహా దాదాపు 30  దేశాలు ఈ ఔషధాన్ని తమకు సరఫరా చేయాలని కోరాయి.  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. 'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఔషధాన్ని తమకు పంపించాలని ప్రస్తావించారు. ఐతే భారత దేశం కూడా దీనిపై నిర్ణయం తీసుకుంది. దేశీయ అవసరాలకు సరిపోయిన తర్వాత మిగతా దేశాలకు 'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఔషధాన్ని పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఈ  ఔషధంపై ఉన్నఎగుమతుల నిషేధాన్ని  పాక్షికంగా ఎత్తివేయనున్నారు.

భారత్ మళ్లీ నవ్వుతుంది..!! 

ఇందుకోసం ఏప్రిల్ 6న భారత ప్రభుత్వం ఎగుమతి విధానంలో మార్పు తీసుకొచ్చింది. యాంటీ మలేరియా డ్రగ్ 'హైడ్రాక్సీక్లోరోక్విన్'   తయారు చేసేందుకు ఉపయోగించే రసాయనాలను .. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ జాబితా నుంచి తొలగించింది. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News