Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..

Kalki 2898 AD - Anna Ben: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాలో సూపర్ సేవరియర్ నటించిన ‘అన్నాబెన్’ గురించి సినిమాలో మాట్లాడుకుంటున్నారు. కాంప్లెక్స్ నుంచి నుండి సుమతి (దీపికా) పాత్రను సేవ్ చేసే రెబల్ పాత్రలో మంచి పర్ఫామెన్స్ కనబరిచింది. ఇంతకీ ఈమె ఎవరనేది ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

1 /5

 Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో దీపికా పాత్రను కాపాడే శంబల్ రెబల్ క్యారెక్టర్ చేసిన కైరా గురించి అందరు డిస్కస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ లకు ధీటుగా పోరాటాలు చేసిన లక్కీ రెబల్ గా ఈమె పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ పాత్రలో అన్నా బెన్ ఒదిగిపోయింది.

2 /5

అన్నాబెన్ మలయాళీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె తండ్రి స్వతహాగా మలయాళ చిత్రసీమలో మంచి రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఫ్యాషన్ రంగంలో రాణించి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. 

3 /5

2019లో ప్రముఖ మలయాళీ సినిమా ‘కుంబలంగి నైట్స్’ మూవీతో మలయాళ చిత్రసీమలో ప్రవేశించింది. అంతేకాదు తొలి సినిమాతోనే పలు ప్రైవేటు సినీ అవార్డ్స్ కూడా అందుకుంది.

4 /5

ఆ సినిమా తర్వాత హెలెన్, కప్పేలా, నారదన్, నైట్ డ్రైవ్, కాపా వంటి చిత్రాలు నటిగా అన్నా బెన్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. అలా ఈమెకు ‘కల్కి 2898 AD’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

5 /5

మొత్తంగా అన్నా బెన్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్టైయ్యాయి. అంతేకాదు 100 శాతం స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతున్న ఈ భామ ఖాతాలో ఇపుడు ‘కల్కి ’ సక్సెస్ తో మరో విజయం నమోదు కావడం విశేషం.