Vidadala rajini land scam in jagananna colony: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వం మారడంతో గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే సీఎం చంద్రబాబు.. వైసీపీ తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టమున్నట్లు ప్రవర్తించారని అన్నారు. ఏపీలో అనేక జిల్లాలలో వైసీపీకి చెందిన పార్టీ ఆఫీసుల కోసం అప్పణంగా భూములు కేటాయించారన్నారు. అంతేకాకుండా..కేవలం నామమాత్రపు చార్జీలకే ఏళ్లపాటు లీజుకు సైతం ఇచ్చారన్నారు. ఇప్పటికే గుడివాడలో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు తమ నియోజక వర్గాలలో ఆక్రమించుకున్నారని కొందరు స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు.
Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
ఇదిలా ఉండగా... వైసీపీ అక్రమాలను వదిలేదని లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు సర్కారు ఇప్పటికే హెచ్చరిచ్చింది. ఇదిలా ఉండగా.. చిలకలూరీ పేటకు చెందిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడదల రజీని తమను మోసం చేసి, అక్రమంగా డబ్బులు దండుకున్నారని రైతులు ఆరోపించారు. విడదల రజీని ఏకంగా రూ.1.16 కోట్ల కమిషన్ ను రైతుల నుంచి తీసుకున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో విడదల రజిని రైతుల వద్ద కమీషన్‌గా తీసుకున్నారని అక్కడి రైతులు ఆరోపణలుచేశారు. చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు, రైతు నాయకుడు గడిపూడి దశరథ రామయ్యల ప్రకారం.. పసుమర్రుకు సమీపంలో ఉన్న గుదేవారిపాలెంలో సుమారు 200 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణం చేపట్టారు
మంత్రిగా రజిని హయాంలో 150 ఎకరాల భూసేకరణ జరిగిందన్నారు. దీనిలో.. 32 మంది రైతుల నుంచి 50 ఎకరాల భూసేకరణ చేశారు. అప్పట్లో ఎకరాకు రెండున్నర లక్షలు చొప్పున, మొత్తంగా రూ.1.16 కోట్ల మొత్తాన్ని మంత్రి రజిని తన అనుచరుల ద్వారా ముక్కు పిండి వసూలు చేశారని రైతులు ఆరోపించారు. ఈ విషయంపై రైతులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..
స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని కలసి తమ గోడును చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రజిని మనుషులు రైతులకు రూ.90 లక్షలు వెనక్కి ఇచ్చానట్లు సమాచారం. మిగిలిన రూ.26 లక్షలు శుక్రవారం రైతులకు ఇచ్చే ఏర్పాటు చేశారంట. ఈ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినీ కాదు.. వసూళ్ల రజనీ.. బైటపడ్డ బిగ్ స్కామ్..
భూభాగోతంలో మాజీ మంత్రి..
విడుదల రజీనిపై పోలీసు కేసు..