India Covid-19: లక్షకు చేరువలో కరోనా మరణాలు

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాలు లక్షకు చేరువగా సంభవించాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.

Last Updated : Oct 2, 2020, 09:54 AM IST
India Covid-19: లక్షకు చేరువలో కరోనా మరణాలు

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాలు లక్షకు చేరువగా సంభవించాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. అయితే.. గత 24గంటల్లో గురువారం ( అక్టోబరు 1న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 81,484 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,095 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,94,069 కి చేరగా.. మరణాల సంఖ్య 99,773 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 53,52,078 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,42,217 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 83.70 శాతం ఉండగా..  మ‌ర‌ణాల రేటు 1.56 శాతంగా ఉంది. అయితే యాక్టివ్ కేసుల రేటు 14.74శాతం ఉందని వైద్యశాఖ వెల్లడించింది. Also read: Hathras Case: అర్థరాత్రి దహన సంస్కారాలపై వివరణ ఇవ్వండి: మహిళా కమిషన్

ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 10,97,947 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 1 వరకు మొత్తం 7,67,17,728 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Hathras gang rape case: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. హత్రాస్ ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

Trending News