humanoid 'Vyommitra' to be placed in Gaganyaan : అంతరిక్షంలోకి సగం మానవ రూపం

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం. .. ISRO ప్రతిష్ఠాత్మకంగా గగన్‌యాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మరికొద్ది రోజుల్లోనే గగన్‌యాన్ ప్రాజెక్టు కింద మానవరహిత అంతరిక్ష యాత్రను చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది.

Last Updated : Jan 22, 2020, 04:21 PM IST
humanoid 'Vyommitra' to be placed in Gaganyaan : అంతరిక్షంలోకి సగం మానవ రూపం

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం. .. ISRO ప్రతిష్ఠాత్మకంగా గగన్‌యాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మరికొద్ది రోజుల్లోనే గగన్‌యాన్ ప్రాజెక్టు కింద మానవరహిత అంతరిక్ష యాత్రను చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా సన్నాహాలు చేస్తోంది. ఐతే ఇందులో భాగంగానే ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు. తొలుత గగన్‌యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సగం మానవ రూపాన్ని అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఓ సరికొత్త రోబోను రూపొందించారు. దీన్ని హాఫ్ హ్యూమానాయిడ్‌గా పిలుస్తున్నారు. 


అంటే మానవునికి ఇది సగం రూపమన్నమాట. అంటే మనిషి చేసే పనుల్లో సగం వరకు ఇది నిర్ధిష్టంగా పూర్తి చేస్తుంది. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ సగం మానవ రూపాన్ని ప్రదర్శించారు. ఈ రోబోకు వ్యోమమిత్ర అని పేరు కూడా పెట్టారు. దీన్ని గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి పంపించనున్నారు. అంటే అంతరిక్షంలో వ్యోమగాములు చేసే పనులను ఇది పూర్తి చేస్తుంది. మనుష్య వ్యోమగాముల్లాగే ఇది కూడా భూమికి సరైన సమాచారం పంపిస్తుందని ఇస్రో శాస్త్రవేత్త శ్యామ్ దయాల్ తెలిపారు. ఓ సరికొత్త ప్రయోగం కింద దీన్ని చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతమైతే .. భారత అంతరిక్ష రంగంలో మరో సంచలనం నమోదవుతుంది. సో.. ఆల్ ది బెస్ట్ టు ఇస్రో.. .

Trending News