Tea Seller: ఛాయ్‌వాలా బ్యాంక్ లోన్ రూ.50 కోట్లా!

కరోనా వైరస్ (CoronaVirus) కష్ట కాలంలో అన్ని రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఓ టీ కొట్టు నడుపుకునే ఓ వ్యక్తి (Tea Seller) ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.

Last Updated : Jul 23, 2020, 07:48 AM IST
Tea Seller: ఛాయ్‌వాలా బ్యాంక్ లోన్ రూ.50 కోట్లా!

కరోనా వైరస్ (CoronaVirus) కష్ట కాలంలో అన్ని రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఓ ఛాయ్‌వాలా (Tea Seller) ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. లోన్ కోసం బ్యాంకుకు వెళ్లాడు. ఫామ్ తీసుకుని అప్లై చేసిన టీ కొట్టు నిర్వాహకుడికి బ్యాంకు భారీ షాక్ ఇచ్చింది. Gold Price In Hyderabad: 2 రోజుల్లో రూ.6వేలు పెరిగిన వెండి ధర

ఈ ఘటనపై టీ షాపు నిర్వాహకుడు రాజ్‌కుమార్ ఏఎన్ఐ మీడియాతో మాట్లాడి తన ఆవేదనను పంచుకున్నాడు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమేర రుణం తీసుకుందామని బ్యాంకుకు వెళ్లాను. లోన్ కోసం అప్లై చేశా. నా లోన్ రిజెక్ట్ అయింది. అందుకు కారణం అడిగితే నువ్వు ఇదివరకే రూ.50 కోట్ల మేర రుణం (Tea Seller Bank Loan) తీసుకున్నావ్. మరోసారి లోన్ ఇవ్వడం కుదరదని బ్యాంకు ఉద్యోగులు తేల్చి చెప్పారు. నేను దరఖాస్తు చేయకుండానే నా పేరిట అంత పెద్ద మొత్తంలో లోన్ ఎలా, ఎవరికి ఇచ్చారో అర్థం కావడం లేదంటూ’ టీ కొట్టు నిర్వాహకుడు రాజ్‌కుమార్ తన ఆవేదనను వెల్లగక్కాడు. Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోన్ తీసుకోకుండానే రూ.50 కోట్లు బాకీ పడ్డ ఛాయ్‌వాలా అని కామెంట్లు చేస్తున్నారు. టీకొట్టు నడిపే వ్యక్తికి ఎవడైనా రూ.50 కోట్ల రుణం ఎలా ఇస్తాడంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు  
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News