Vaccination Offers; కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రోత్సహించేందుకు..ఆ వంకతో బిజినెస్ పెంచుకునేందుకు వ్యాపారస్థులు కొత్తగా ఆలోచిస్తున్నారు. వ్యాక్సన్ వేయించుకున్నవారికి భారీ ఆఫర్లు అందిస్తున్నారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్(Vaccination Drive)విస్తృతంగా జరుగుతోంది. ఆ రాష్ట్రంలో వ్యాపారస్థులు మాత్రం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా అనుకూలంగా మల్చుకుంటున్నారు. వ్యాక్సినేషన్‌తో బిజినెస్ పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. బంపర్ ఆపర్లు ప్రకటిస్తున్నారు.టీకా మహోత్సవ్ పేరుతో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మిగిలిన పట్టణాల కంటే గురుగ్రామ్ తొలిస్థానంలో ఉంది. వ్యాక్సిన్ వేయడం, కరోనా నిబంధనలు పాటించడం వల్ల గురుగ్రామ్‌లో కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. ప్రస్తుతం గురుగ్రామ్‌లో (Gurugram) కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. రేపు గురుగ్రామ్ జిల్లాలో 30 వేలమందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రోత్సహించేందుకు..బిజినెస్ పెంచుకునేందుకు వ్యాపారస్థులు కస్టమర్లకు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తూనే ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగిల్ డోసు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి 25 శాతం డిస్కౌంట్, రెండు డోసులు వేయించుకుంటే 50 శాతం డిస్కౌంట్( 50 Percent Discount for vaccinated) ఇస్తున్నారు.ఈ ఆఫర్లతో అటు వ్యాక్సినేషన్ డ్రైవ్, ఇటు బిజినెస్ రెండూ పెరుగుతాయంటున్నారు. మరి కొందరైతే ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. ఐడీ కార్డు చూపించి ఆఫర్ పొందవచ్చు.
Also read; India COVID-19 Cases: ఇండియాలో 60 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook