ఉగ్రవాది హఫీజ్ విడుదలయ్యాడు..!

ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక సభ్యుడు మరియు ఉగ్రవాద సంస్ధ జేయూడీ అధినేత హఫీజ్‌ సయీద్‌ గృహ నిర్బంధం నుండి విడుదలయ్యాడు.

Last Updated : Nov 24, 2017, 02:05 PM IST
    • హఫీజ్ సయీద్ ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక సభ్యుడు
    • హఫీజ్ మిల్లీ ముస్లిం లీగ్స్ పేరిట పార్టీ ప్రారంభించారు
    • అంతర్జాతయ ఉగ్రవాది హఫీజ్‌పై 10 మిలియన్ల రివార్డు ఉంది
ఉగ్రవాది హఫీజ్ విడుదలయ్యాడు..!

ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక సభ్యుడు మరియు ఉగ్రవాద సంస్ధ జేయూడీ అధినేత హఫీజ్‌ సయీద్‌ గృహ నిర్బంధం నుండి విడుదలయ్యాడు. ఆయన నిర్బంధం గడువును పొడిగించవద్దని... వెంటనే విడుదల చేయాలని లాహోర్‌ హైకోర్టు ఇటీవలే తెలిపింది. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి హఫీజ్ విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీరీల కోసం తన ఉద్యమం ఆగదని తెలిపాడు. 

‘కాశ్మీరుకు మద్దతిస్తున్నాననే కారణంతో నన్ను గృహనిర్బంధం చేశారు. ఇది జరిగి పది నెలలు కావస్తోంది. అయితే నా పోరాటం ఆగదు. నేను పాకిస్థాన్‌ జనాలను ఐకమత్యం అనే తాటిపై నడిపి.. కాశ్మీరు జనులకు స్వాత్రంత్యం తేవడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పాడు.  భారత్‌ తనపై చేస్తున్న ఆరోపణలు నిజం కాదని ఈ సందర్భంగా హఫీజ్‌ అన్నాడు. తన పొరపాటు ఏమీ లేదని కోర్టు ఎప్పుడో తెలిపిందని ఆయన పేర్కొనడం గమనార్హం. భారత్‌ చేస్తున్న వాదనలను నిజమని నమ్మి మాత్రమే అమెరికా పాకిస్తాన్ పై ఒత్తిడి తెస్తుందని ఈ సందర్భంగా హఫీజ్ తెలిపాడు

ముంబయి దాడుల సూత్రధారైన హఫీజ్‌ను జనవరి 31 నుంచి నిర్బంధంలోకి తీసుకున్నారు. నవంబర్‌ 23తో అతడి నిర్బంధం గడువు ముగుస్తున్న సందర్భంలో... అదే  గడువును మూడు నెలల పాటు పొడిగించాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వం న్యాయస్థానంలో పిటిషన్‌ ఫైల్ చేసింది. అదే పిటిషన్‌ను విచారించిన లాహోర్‌ హైకోర్టు గడువు పొడిగించడానికి  నిరాకరించింది. హఫీజ్‌‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయమని ప్రభుత్వానికి తెలిపింది. ఒకప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్‌పై అమెరికా 10 మిలియన్ల రివార్డు ప్రకటించారు. గతంలో మిల్లీ ముస్లిం లీగ్స్ (ఎంఎంఎల్) పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పి, నమోదు కోసం పాకిస్తాన్ ఎన్నికల సంఘానికి హఫీజ్ దరఖాస్తు కూడా చేసుకున్నాడు.

Trending News