రానున్న ఆర్థిక సంవత్సరంలో 80 మిలియన్ల మంది మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్స్ అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర బడ్జెట్ 2018 ప్రకటనలో ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. ఇంటింటికీ గ్యాస్ పేరిట కేంద్రం తీసుకువచ్చిన ఉజ్వల పథకం కింద నిరుపేద మహిళలకు ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వనున్నట్టు అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
గతంలో 50 మిలియన్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఈసారి ఆ సంఖ్యను 80 మిలియన్లకు పెంచింది.