Ayodhya Ram Lalla: శ్రీరాముడి జన్మస్థలంలో తిరుమల వెంకటేశ్వరుడు.. త్వరలోనే అయోధ్యలో శ్రీవారి ఆలయం?

Tirumala Temple Will Built In Ayodhya Very Soon: రెండు అవతార పురుషులు.. ఒకేసారి కలుసుకున్నట్టు పరిణామం కనిపించింది. తిరుమల శ్రీవారి పట్టువస్త్రాలు అయోధ్య రామ్‌లల్లాకు చేరుకున్నాయి. అయోధ్య రాముడికి తిరుమల శ్రీవారి తరఫున పూజలు జరగడం విశేషం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 19, 2025, 09:51 PM IST
Ayodhya Ram Lalla: శ్రీరాముడి జన్మస్థలంలో తిరుమల వెంకటేశ్వరుడు.. త్వరలోనే అయోధ్యలో శ్రీవారి ఆలయం?

Tirumala Temple In Ayodhya: అయోధ్య రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయంలో కొలువైన రామ్‌లల్లాకు ప్రత్యేక పట్టువస్త్రాలు టీటీడీ తరఫున అందాయి. అనంతరం బాల రాముడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భవిష్యత్‌లో అయోధ్య, తిరుమల ఆలయాలు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాయని ఇరు ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రతి యేటా సరికొత్త ఆనవాయితీని కొనసాగించాలని ఆలయ కమిటీలు నిర్ణయించుకున్నాయి.

Also Read: Tirumala: తిరుమలలో మరో వివాదం.. వైకుంఠ ద్వార పుష్పాలంకరణపై రచ్చ

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం బాలరాముడిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ బృందాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయ విశిష్టతను వివరించారు.

Also Read: Old Age Marriage: వృద్ధాశ్రమంలో పెళ్లితో ఒక్కటైన '68 ఏళ్ల ముసలి ప్రేమ..'

దర్శనం అనంతరం రామజన్మభూమి ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌తో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. రెండు ఆలయాలు కలిసి పనిచేయడం సహా ఇతర కీలక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. భవిష్యత్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం-అయోధ్య రామ మందిరం కలిసి పని చేయాలనే సంకల్పంతో పరస్పర అవగాహనపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం.

అనంతరం టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 'అయోధ్య రామాలయ సందర్శన గొప్ప అనుభూతి కలిగించింది. వెంకటేశ్వర స్వామి తరఫున శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించాం. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాది ఈ సాంప్రదాయం ఇలానే కొనసాగుతుంది' అని ప్రకటించారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా అయోధ్య నుంచి భవిష్యత్తులో వస్త్రాలు సమర్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయోధ్యలోను టీటీడీ దేవాలయం నిర్మాణానికి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు ముఖ్య ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు సూచనలు చేసినట్లు బీఆర్‌ నాయుడు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News