బంగారం ధరలు పతనం.. అదే దారిలో వెండి
బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజూ బంగారం ధరలు తగ్గాయి. మొన్న మార్కెట్లో ఆల్‌టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన బంగారం ధరలు దిగి రావడం కొనుగోలుదారులకు శుభవార్త. మరోవైపు వెండి సైతం బంగారం దారిలోనే నడిచింది. Gold, Silver: పొలంలో బంగారు, వెండి ఆభరణాల చెంబులు
ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న రూ.550 మేర తగ్గగా, నేడు రూ.500 మేర ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,650కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,450కి పడిపోయింది. నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.390 మేర ఓ మోస్తరుగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,780కి దిగొచ్చింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,680కి క్షీణించింది. గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
నేటి మార్కెట్‌లో బంగారం ధరలు పతనం కాగా, వెండి సైతం బంగారాన్ని అనుసరించింది. నేటి మార్కెట్‌లో వెండి ధర రూ.1,260 మేర భారీగా తగ్గింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.48,900కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి
బంగారం ధరలు పతనం.. అదే దారిలో వెండి