Gaganyaan Yatra: ఇండియా తొలిసారి తలపెట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం కానుంది, ఎలా ఉంటుందనే వివరాల్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించాల్సిన నాలుగు మిషన్లలో మొదటి టెస్ట వెహికల్ మిషన్ టీవీ-డీ1ను 2023 మే నెలలో ఉంటుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
భారతదేశం మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ పేరుతో చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అన్ని ఏర్పాట్లు అనుకున్నట్టుగా జరిగితే తొలి భారత అంతరిక్ష యాత్ర 2024లో ఉంటుంది. వాస్తవానికి ఈ యాత్రను 2021లో చేపట్టాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. గగన్‌యాత్రకు సంబంధించిన వివరాల్ని లోక్‌సభలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టే నాలుగు అబార్ట్ మిషనల్లో మొదటిది టెస్ట్ వెహికల్ మిషన్ టీవీ-డీ1. దీనిని ఈ ఏడాది మేలో నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. ఈ పరీక్ష విజయవంతమైన తరువాతే ఇతర ప్రయోగాలుంటాయి. టీవీ-డీ2 మానవ సహిత అంతరిక్ష యాత్రల్ని 2024 మొదటి త్రైమాసికంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి వ్యోమగాముల మొదటి విడత శిక్షణ పూర్తయింది.
గగన్‌యాన్ కార్యక్రమాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ దేశాలే మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టింది. ఇప్పుడు తొలిసారిగా ఇండియా చేపట్టనుంది. అంతరిక్ష నౌకను భూమి నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగించి..అక్కడి నుంచి పారాచూట్లతో క్యాప్సూల్ ద్వారా వ్యోమగాముల్ని భూమికి తీసుకురానున్నారు.
గగన్‌యాన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పటికే టెస్ట్ ఫ్లైట్ నిర్వహించింది. దీనికోసం స్పేస్ ఫేరింగ్ హ్యుమనాయిండ్ రోబోను ఉపయోగించనున్నారు. గగన్‌యాన్ కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నలుగురు ఫైటర్ పైలట్లను ఇస్రో గుర్తించింది. రష్యాలో వీరి శిక్షణ కొనసాగుతోంది. జీరో గ్రావిటీ, స్పేస్ వాతావరణాన్ని తట్టుకునేలా శిక్షణ అందుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook