Supreme Court covid effect: సుప్రీం కోర్టులో కరోనా కలకలం, జడ్జిలకు, 150 మంది సిబ్బందికి కోవిడ్

ఢిల్లీలో కోవిడ్‌ (Covid) విజృంభిస్తోంది. అక్కడ రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య కూడా ఇరవై వేలకు చేరుకుంది. 400 మంది పార్లమెంట్‌ (Parliament‌) సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive‌) నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 09:18 PM IST
  • సుప్రీం కోర్టు జడ్జిలకు కరోనా
  • 150 మంది సుప్రీం కోర్టు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌
  • కోవిడ్ బారిన పడ్డ 5 శాతం స్టాఫ్‌ మెంబర్స్
Supreme Court covid effect: సుప్రీం కోర్టులో కరోనా కలకలం, జడ్జిలకు, 150 మంది సిబ్బందికి కోవిడ్

Four judges and 150 staff of Supreme Court test Covid positive : ఢిల్లీలో కోవిడ్‌ (Covid) విజృంభిస్తోంది. అక్కడ రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య కూడా ఇరవై వేలకు చేరుకుంది. 400 మంది పార్లమెంట్‌ (Parliament‌) సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive‌) నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 

ఇక సుప్రీం కోర్టు (Supreme Court) సిబ్బందిలో చాలా మంది కరోనా బారినపడ్డారు. సుప్రీం కోర్టులో నలుగురు న్యాయమూర్తులు తాజాగా కోవిడ్ బారినపడ్డారు. ఈ జడ్జీలు (Judges) గత మంగళవారం, జస్టిస్‌ సుభాషన్‌ రెడ్డి రిటైర్డ్‌మెంట్ కార్యక్రమానికి హజరయ్యారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణతో పాటు మొత్తం 32 మంది జడ్జిలున్నారు. వీరిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive‌) నిర్ధారణ అయింది.

ఇక సుప్రీం కోర్టుకు చెందిన 150 మంది ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో క్వారంటైన్‌లో ఉన్నారు. సుప్రీంకోర్టులో మొత్తం 3వేల మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 150 మంది (150 staff) అంటే ఐదు శాతం స్టాఫ్‌ కోవిడ్ బారిన పడింది. 

అయితే కోవిడ్ వ్యాప్తి పెరగడం వల్ల సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే కోవిడ్‌ టెస్ట్‌ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీలో కోవిడ్‌ (Delhi Covid‌) ప్రభావం తీవ్రంగా ఉండడంతో జనవరి 3 నుంచి సుప్రీం కోర్టులో కేసుల విచారణ వర్చువల్‌ పద్ధతిలో జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఇలాగే కేసుల విచారణ సాగనుంది.

Also Read : Sulli deals app: సుల్లి డీల్స్ యాప్ సృష్టికర్త అరెస్ట్.. అసలు ఈ 'సుల్లి డీల్స్' యాప్ ఏంటి ?

తాజాగా ఢిల్లీలో 20,181 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఢిల్లీ ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తే లాక్‌డౌన్‌ అమలు చేయమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. అయితే కోవిడ్‌ (Covid‌) ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

Also Read : Central Govt: కొవిడ్ ఎఫెక్ట్: ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News