మధ్యప్రదేశ్‌లో దారుణం, తల్లి మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లిన నలుగురు కూతుళ్లు

తల్లి ప్రాణాలు కాపాడుకోటానికి నలుగురు కూతుళ్లు 5 కిలీమీటర్ల దూరంలో కమ్యూనిటీ సెంటర్ కు మోసుకెళ్లటం.. అయినప్పటికీ ఆమె మరణించటం.. తిరిగి శవాన్ని మోసుకెళ్లటం.. పలువురిని కన్నీటిపర్యంతం అవుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 11:40 AM IST
  • అందరిని దుఃఖానికి గురి చేస్తున్న ఘటన
  • తల్లి శవాన్ని 5 కిమీ మోసుకెళ్లిన కూతుళ్లు
  • ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం
మధ్యప్రదేశ్‌లో దారుణం, తల్లి మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లిన నలుగురు కూతుళ్లు

Madhya Pradesh: మన చుట్టూ ఉన్న సమాజంలో కొన్ని ఘటనలు ఎంతో బాధకలిగిస్తూ ఉంటాయి. అలాంటిదే ఒకటి మధ్యప్రదేశ్ చోటు చేసుకుంది. తల్లి ప్రాణాలు కాపాడుకోటానికి నలుగురు కూతుళ్లు 5 కిలీమీటర్ల దూరంలో కమ్యూనిటీ సెంటర్ కు మోసుకెళ్లారు. అలా తీసుకెళ్లినప్పటికీ ఆ మాతృ మూర్తి ప్రాణాలు కాపాడుకోలేకపోవటంతో కన్నీరు మున్నీరు అయ్యారు ఆ కూతుళ్లు. తల్లి శవాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లటానికి కూడా ఎవరు సహాయం చేయకపోవటంతో.. మళ్లీ చేతులపై మోసుకుంటూ వెళ్లిన ఘటన పలువురిని బాధకు గురి చేస్తుంది.. 

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ ముసలి తల్లిని కాపాడుకోవడానికి నలుగురు కూతుళ్లు చేసిన ప్రయత్నం అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. రేవా జిల్లా రాయ్ పూర్ గ్రామంలో 80 ఏళ్ల ములియా అనే మహిళకు తీవ్ర అనారోగ్యం కలిగింది. పరిస్థితి విషమించడంతో ఆమె నలుగురు కూతుళ్లు కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కమ్యూనిటీ సెంటర్ కు తీసుకెళ్దామంటే సమయానికి ఆదుకునేవారే కనిపించలేదు. కనీసం ఓ వాహనం ఏర్పాటుచేసుకోలేని దుస్థితిలో వారే ఓ మంచంపై తమ తల్లికి పడుకోబెట్టి కమ్యూనిటీ సెంటర్ కు నడుచుకుంటూ తీసుకెళ్లారు.

అయితే అక్కడికి వెళ్లేసరినే ఆ ముసలితల్లి చలనం కోల్పోయింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు చనిపోయిందని తేల్చేశారు. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన నలుగురు కూతుళ్లు అంబులెన్స్ కోసం అక్కడి అధికారులను వేడుకున్నారు. వారు స్పందించకపోవడంతో చేసేదిలేక తిరిగి అదే మంచంపై ఆమెను పడుకోబెట్టి ఊరుబాట పట్టారు. ఈ సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది.  

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అటు విపక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసింది. అటు తల్లిని బతికించుకోవడానికి కోసం కుమార్తెలు పడ్డ కష్టం జనం చేత కంటతడిపెట్టించింది.

Also Read: Nitish Kumar Vice President: భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ సీఎం నితీష్ కుమార్!

Also Read: LPG Gas Price Hike: భారీగా పెరిగిన LPG గ్యాస్ ధర.. సిలిండర్ పై రూ.250 పెంపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News