మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లా భుసావల్ లోని ఓ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు నాలుగు అగ్ని మాపక బృందాలు ప్రయత్నించాయి.
భుసావల్ లోని ఓ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... నాలుగు ఫైర్ టెండర్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మంటలు ఆర్పేందుకు వారు చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగ కూడా అలుముకుంది.
#WATCH Maharashtra: Fire breaks out a company in Bhusawal of Jalgaon district. Four fire tenders are present on the spot. pic.twitter.com/FnnxgIu09o
— ANI (@ANI) April 26, 2020
లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఎవరూ లేరు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఐతే అగ్ని ప్రమాదానికి కారణాలేంటనేది తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం