బడ్జెట్‌లో 'మధ్య తరగతి' కష్టాలపై అరుణ్ జైట్లీతో 'జీ ఎక్స్‌క్లూజీవ్' ఇంటర్వ్యూ

జీ బిజినెస్‌కి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ

Last Updated : Feb 3, 2018, 06:23 PM IST
బడ్జెట్‌లో 'మధ్య తరగతి' కష్టాలపై అరుణ్ జైట్లీతో 'జీ ఎక్స్‌క్లూజీవ్' ఇంటర్వ్యూ

కేంద్ర ప్రభుత్వం ఈసారి కేంద్ర బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజానికానికి అన్యాయం చేసిందని, ఈ బడ్జెట్ మధ్య తరగతి వారి నడ్డి విరిచే బడ్జెట్ అని వస్తోన్న విమర్శలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. మధ్య తరగతి వారి కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయించాం అని స్పష్టంచేసిన అరుణ్ జైట్లీ.. వారి కోసమే ప్రామాణిక తగ్గింపు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు రోజులకి శనివారం ప్రముఖ మీడియా హౌజ్ జీ గ్రూప్‌కి చెందిన జీ బిజినెస్ న్యూస్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కస్టమ్స్ సుంకం పెంపుపై స్పందిస్తూ.. దీర్ఘ కాలంలో సత్ఫలితాలను రాబట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు జైట్లీ చెప్పారు. కస్టమ్స్ సుంకం పెంపు వల్ల దిగుమతులు తగ్గి, దేశీయంగా ఉత్పత్తుల తయారీ పెరుగుతుంది. ఫలితంగా ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని జైట్లీ అభిప్రాయపడ్డారు.

మధ్య తరగతి వారికోసం ఇప్పటికే చాలా చేశాం. గత బడ్జెట్స్‌లో మధ్య తరగతి ప్రజానికం కోసం కేంద్రం ఎంతో కృషి చేసింది. అంతేకాదు.. ద్రవ్య లోటు ప్రకారం భవిష్యత్‌లోనూ మధ్య తరగతి వారికి మరిన్ని అభివృద్ధి ఫలాలు అందించే ప్రయత్నం చేయనున్నాం. తాను ప్రవేశపెట్టిన గత నాలుగైదు బడ్జెట్స్ సగటు మొత్తాన్ని పరిశీలిస్తే, సామాన్యుడు, తక్కువ పన్ను పరిధిలోకి వచ్చే వారికి మేలు జరిగే విధంగానే ఆయా బడ్జెట్స్‌ని తీర్చిదిద్దడం జరిగిందనే విషయం అర్థమవుతుందని జైట్లీ పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో భారీ స్థాయిలో మౌళిక వసతలు కల్పించాలన్నా, దేశ సరిహద్దులు, సామాజిక భద్రత లాంటి జాతి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నా.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని జైట్లీ స్పష్టంచేశారు. 

Trending News