Vijayendra Prasad: రాజ్యసభలో ఎంపీగా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం..!

Vijayendra Prasad: రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ సభ్యులు ప్రమాణం చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 18, 2022, 02:51 PM IST
  • రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
  • ప్రమాణం చేసిన విజయేంద్ర ప్రసాద్
  • ఎన్నో సినిమాలకు కథలు ఇచ్చిన రచయిత
Vijayendra Prasad: రాజ్యసభలో ఎంపీగా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం..!

Vijayendra Prasad: రాజ్యసభ సభ్యుడిగా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు..ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇటీవల విజయేంద్రప్రసాద్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపిక చేసింది. 2027 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ..ఈక్రమంలో విజయేంద్ర ప్రసాద్, ఇళయ రాజాలను ఎంపిక చేసింది. 

పశ్చిమ గోదావరి జిల్లా కోవ్వూరులో విజయేంద్ర ప్రసాద్ జన్మించారు. ఆయన తండ్రి ఓ కాంట్రాక్టర్. విజయేంద్ర ప్రసాద్‌కు ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఇందులో అందరికంటే విజయేంద్ర ప్రసాద్‌ చిన్నవాడు. ఆయన అన్న శివదత్తాకు కళలు, కవిత్వంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈక్రమంలో దర్శకుడిగా మారేందుకు మద్రాసు వెళ్లారు. ఆయన చాలా సినిమాలకు రచయితగా పనిచేసినా సక్సెస్ కాలేకపోయారు.

ఆ సమయంలో తన అన్న శివ దత్తాతో కలిసి విజయేంద్ర ప్రసాద్‌ రచనలు రాసేవారు. ఈక్రమంలో బంగారు కుటుంబం సినిమాకు తొలి స్టోరీని రాశారు. ఆ తర్వాత బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, జానకి రాముడు, సమరసింహారెడ్డి, సై, నా అల్లుడు, ఛత్రపతి, మగధీర వంటి సినిమాలకు కథలను సమర్పించారు. ప్రపంచ దృష్టికి ఆకర్షించిన బాహుబలి సినిమాకు సైతం విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. 

ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా బంపర్ హిట్ అయ్యింది. దీంతో ఒక్కసారి విజయేంద్ర ప్రసాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఆ తర్వాత ఆర్ఆర్‌ఆర్ సినిమాకు పని చేశారు. తెలుగుతోపాటు ఇతర భాషలకు సైతం కథలు అందించారు. రౌడీ రాథోర్, బజరంగీ భాయిజాన్, మణికర్ణిక సినిమాలకు వర్క్ చేశారు.

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..!

Also read:CM Jagan: వరద బాధితులకు తక్షణ సాయం అందించాలి..కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News