EPF Interest Rate: ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ మరో వారం రోజుల్లో జమ కానుంది. మీ అక్కౌంట్లలో వడ్డీ జమ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎంప్లాయింస్ ప్రొవిడెంట్ ఫండ్. ఈపీఎఫ్ (EPF)ఖాతాదారుల ఖాతాల్లో మరో వారం రోజుల్లో అంటే ఈ నెలాఖరులోగా వడ్డీ జమ కానుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును మార్చకుండా 8.5 శాతం కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 లో కోవిడ్ 19 కారణంగా మార్చ్ 2020 పీఎఫ్ వడ్డీరేటును 2019-20 ఆర్ధిక సంవత్సరానికి 8.5 శాతానికి తగ్గించింది. గత ఏడేళ్లలో ఇదే కనిష్టం. రిటైర్‌మెంట్ ఫండ్ రెగ్యులేటర్ వచ్చే వారం రోజుల్లో 6 కోట్లమంది చందాదారుల ఖాతాల్లో ఈపీఎఫ్ వడ్డీ 8.5 (Epf Interest rate)శాతంను జమ చేయనుంది.
ఈపీఎఫ్ చందాదారులు ఎస్ఎమ్ఎస్ ద్వారా లేదా మిస్డ్‌కాల్ ద్వారా ఈపీఎఫ్ ఖాతా (Pf Balance Check)బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ద్వారా 011-22901406కు మిస్డ్‌కాల్ ఇవ్వండి. మిస్డ్‌కాల్ ఇచ్చిన కాస్సేపటికే మీ అక్కౌంట్ బ్యాలెన్స్ వివరాలు మెస్సేజ్ రూపంలో వస్తాయి. ఇక EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎఎంఎస్ ఇచ్చి తెలుసుకోవచ్చు. అయితే మీ ఖాతాకు మీ మొబైల్ నెంబర్ లింక్ అయుండాలి.
Also read: Eluru Result: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook