EPFO Alert: కరోనాతో EPF ఖాతాదారులు మరణిస్తే, నామినీకి రూ.7 లక్షల పరిహారం

EPFO Alert Of Covid-19: కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI)లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరించిన రూల్ ప్రకారం.. సర్వీస్‌లో ఉన్న ఏ ఉద్యోగి అయినా కరోనా బారిన పడి చనిపోతే అతడి కుటుంబానికి ఈడీఎల్ఐ బెనిఫిట్‌ను ఇన్సూరెన్స్ నగదుగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 17, 2021, 09:02 AM IST
EPFO Alert: కరోనాతో EPF ఖాతాదారులు మరణిస్తే, నామినీకి రూ.7 లక్షల పరిహారం

పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఓ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI)లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరించిన రూల్ ప్రకారం.. సర్వీస్‌లో ఉన్న ఏ ఉద్యోగి అయినా కరోనా బారిన పడి చనిపోతే అతడి కుటుంబానికి ఈడీఎల్ఐ బెనిఫిట్‌ను ఇన్సూరెన్స్ నగదుగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.

గతంలో ఓ కంపెనీలో ఏడాది కాలానికి పైగా పనిచేయకపోతే ఉద్యోగి కుటుంబానికి లేదా నామినీకి ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(EDLI) అందించే అవకాశం లేదు. కానీ ఆ రూల్‌ను సవరించారు. ఉద్యోగి మరణించడానికి ముందు పనిచేస్తున్న కంపెనీలో వరుసగా ఏడాది పనిచేయకపోయినా ఆ ఇన్సూరెన్స్ డిపాజిట్ సొమ్మును నామినీకి అందజేయనున్నారు. తాజాగా సవరించిన నియమం ఏంటంటే.. కరోనాతో ఎవరైనా పీఎఫ్ ఖాతాదారులు మరణించినట్లయితే వారి కుటుంబానికి రూ.7 లక్షల మేర ఈడీఎల్ఐ బెనిఫిట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల పీఎఫ్ ఖాదారుల కుటుంబాలకు తాజా నియమం వల్ల ప్రయోజనం చేకూరనుంది.

Also Read: EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు EPF Balance పూర్తి వివరాలు

సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి చనిపోతే ఆ ఈపీఎఫ్(EPFO) ఖాతాదారుల కుటంబానికి మినిమమ్ అస్యూరెన్స్ బెనిఫిట్ కింద కనిష్టంగా రూ.2.5 లక్షలు అందజేయాలని గతంలో ప్రతిపాదించారు. గరిష్టంగా అయితే మ్యాగ్జిమమ్ అస్యూరెన్స్ కింద రూ.6 లక్షలు మేర చనిపోయిన ఈఫీఎఫ్ ఖాతాదారుడి నామినీకి అందజేయనున్నట్లు కేంద్ర కార్మికశాఖ గతంలో తెలిపింది. దీని కోసం పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు.

ప్రస్తుతం కరోనా సమయం కనుక కోవిడ్19 బారిన పడి ఉద్యోగి ఎవరైనా మరణిస్తే డెత్ బెనిఫిట్ కింద ఈపీఎఫ్ ఖాతాదారుడి నామినీకి రూ.7 లక్షల మొత్తం చెల్లిస్తారు. ప్రతి సంస్థ ఈపీఎఫ్ మరియు ఎంపీ యాక్ట్, 1952 పరిధిలోకి వస్తాయని తెలిసిందే. అయితే ఈపీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ ఫామ్ నెంబర్ 2లో నామినీ వివరాలు పొందుపరిచి ఉండాలి. అలా ఉన్న నామినీలకు మాత్రమే పీఎఫ్ ఖాతాదారులు కరోనాతో చనిపోతే ఈ డెత్ బెనిఫిట్ అందించనున్నామని పేర్కొన్నారు.

Also Read: EPFO: ఈపీఎఫ్ నగదును ఖాతాదారులు పాత అకౌంట్ నుంచి ఇలా Transfer చేసుకోవచ్చు

ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) పెన్షనర్ల విషయానికొస్తే.. లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పిస్తే పెన్షన్ సకాలంలో పొందుతారు. ఆన్‌లైన్‌లోనే ఈ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయవచ్చునని కరోనా వ్యాప్తి మొదలైన గత ఏడాది ఈపీఎఫ్ఓ(EPFO) సూచించింది. గతంలో అయితే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసేందుకు నిర్ణీత గడువు ఉండేది. కానీ తాజా సవరణలతో పెన్షనర్లు ఏడాదిలో ఎప్పుడైనా సరే తమ లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేయవచ్చు. దీనివల్ల అర కోటికి పైగా పెన్షనర్లు ప్రయోజనం పొందుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News