Corona Antibody Cocktail: కరోనా మహమ్మారికి మరో కొత్త మందు వచ్చింది. అమెరికా, యూరప్ దేశాల్లో వినియోగంలో ఉండగా..కొత్తగా ఇండియాలో అనుమతి లభించింది. ధర ఎక్కువే అయినా..కచ్చితంగా పనిచేస్తుందంటున్నారు మరి.
కరోనా యాంటీబాడీ కాక్‌టెయిల్(Corona Antibody Cocktail). ఇదేదో లిక్కర్ కాక్‌టెయిల్ అనుకుంటున్నారా..కానేకాదు. కరోనా బారిన పడిన రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి..వ్యాధి ముదరకుండా చేసే మందు ఇది. రోచే ఫార్మసీ అభివృద్ధి చేసిన యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందు ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో వినియోగంలో ఉంది. తాజాగా ఈ మందుకు ఇండియాలో డీజీసీఐ (DGCI) అనుమతిచ్చింది. ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్ ఒక డోసులో 6 వందల మిల్లీగ్రాముల కాసిరివిమాబ్, మరో 6 వందల గ్రాముల ఇమ్‌డెవిమాబ్ మందులుంటాయి.
ఈ మందును 12 ఏళ్లు పైబడి 40 కిలోలకు మించి బరువున్నవారికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మందు ఇచ్చే సమయంలో రోగి ఆక్సిజన్ లెవెల్స్ 90 శాతానికి పైగా ఉండాలని యాంటీబాడీ కాక్‌టెయిల్ మందును అభివృద్ధి చేసిన రోచే ఫార్మసీ సూచించింది. ఈ కిట్‌ను ఉపయోగించినవారిలో 70 శాత మంది నాలుగు రోజుల్లో కోలుకున్నారని సంస్థ చెబుతోంది. ఈ సంస్థ రూపొందించిన ఈ మందును ఇండియాలో సిప్లా కంపెనీ మార్కెటింగ్ చేస్తోంది. యాంటీబాడీ కాక్‌టెయిల్ ఇండియాలో సానుకూల ఫలితాలు ఇస్తుందనే నమ్మకం ఉందని చెబుతోంది రోచే ఫార్మసీ(Roche Company). రోగిలో కరోనా వ్యాధి ముదరకుండా ఈ మందు అడ్డుకుంటుందంటున్నారు కంపెనీ ప్రతినిధులు. ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఈ మందుతో కోలుకోవచ్చని తెలుస్తోంది. ఈ మందు ఒక్క డోసు ధర 59 వేల 750 రూపాయలుగా ఉంది. ఇద్దరు రోగులకు సరిపడే మందున్న కిట్ 1 లక్షా 19 వేల 5 వందల రూపాయలకు అందిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో(Corona Second Wave) స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలతో ఉన్న రోగుల్లో పరిస్థితి ఉన్నట్టుంది విషమిస్తోందని..అటువంటి వారికి యాంటీబాడీ కాక్‌టెయిల్ ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి (Immunity power)మెరుగవుతుందని చెబుతోంది.
Also read: Yaas Cyclone Update: మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న యాస్ తుపాను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook