Delhi Services Bill 2023: వివాదాస్పద ఢిల్లీ సర్వీసుల బిల్లు చట్టరూపం దాల్చింది. మొన్న లోక్‌సభ నేడు రాజ్యసభ ఆమోదించడంతో చట్టంగా మారింది. అధికారుల నియామకం, బదీలీలపై అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు దక్కేలా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది.
ఇవాళ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన తరువాత అధికార-విపక్షాల మద్య వాడివేడిగా చర్చ సాగింది. మొదటి ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో మద్దతు లభించింది. అయితే విపక్షాలు డివిజన్ కోసం పట్టుబడటంతో రెండోసారి ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. బిల్లుకు మద్దతు పలికిన ఎన్డీయేతర పార్టీలలో వైఎస్సార్ కాంగ్రెస్ , బీజేడీ, బీఎస్పీ, టీడీపీ ఉన్నాయి.
ఢిల్లీలో ఆప్ పాలనలో అరాచకం రాజ్యమేలుతున్నందున బిల్లుకు మద్దతిచ్చినట్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఢిల్లీ ముఖ్యమంత్రిపై పెత్తనం చెలాయించేందుకు ఇద్దరు బ్యూరోక్రాట్లను నియమించారంటూ కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి మండిపడ్డారు. బిల్లును ఆమోదించే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డాకు మధ్య వాదన జరిగింది. కేవలం ఈడీ కేసులపై భయంతో వైసీపీ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు మద్దతిచ్చిందని ఆప్ ఆరోపించింది.
ఇండియా కూటమి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ ఎెంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్ ఒక తానా షాహీ పార్టీగా మారిందన్నారు. రాజ్యాంగానికి లోబడే ఈ బిల్లుకు మద్దతిచ్చినట్టుగా చెప్పారు. మరోవైపు ఆప్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ధ్వజమెత్తింది. రాష్ట్ర అధికారాల్ని లాక్కోవడమే ఈ బిల్లు ఉద్దేశ్యమని..ఆఖరికి ఈ బిల్లు వాజ్‌పేయి, అద్వానీ ఆశయాలకు కూడా వ్యతిరేకంగా ఉందని ఆప్ వెల్లడించింది.
Also read: Manipur incident: మణిపూర్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook