Aftab Poonawala CCTV Footage: శ్రద్ధా శరీర భాగాలున్న బ్యాగుతో అఫ్తాబ్.. పోలీసుల చేతికి సీసీటీవీ దృశ్యాలు ?

Shraddha Walkar Murder Case: సీసీటీవీ ఫుటేజీలో అఫ్తాబ్ పూనావాలా చేతిలో ఓ బ్యాగుతో మూడు రౌండ్స్ వేస్తూ కనిపించినట్టు తెలుస్తోంది. అతడి చేతిలో ఉన్న బ్యాగ్ శ్రద్ధా వాకర్ శరీర భాగాలే అయ్యుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

Written by - Pavan | Last Updated : Nov 19, 2022, 06:28 PM IST
  • శ్రద్ధా వాకర్ దారుణ హత్యలో అనేక సంచలనాలు
  • పోలీసుల చేతికి చిక్కిన సీసీటీవీ దృశ్యాలు
  • సీసీటీవీ దృశ్యాల్లో బ్యాగుతో అఫ్తాబ్ పూనావాల
Aftab Poonawala CCTV Footage: శ్రద్ధా శరీర భాగాలున్న బ్యాగుతో అఫ్తాబ్.. పోలీసుల చేతికి సీసీటీవీ దృశ్యాలు ?

Shraddha Walkar Murder Case: శ్రద్ధా వాకర్ మర్డర్ కేసులో ఏరోజుకు ఆరోజు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రద్ధా మర్డర్ కేసు మిస్టరీని ఛేదిస్తున్న ఢిల్లీ పోలీసులకు తాజాగా అఫ్తాబ్ పూనావాలా ఉన్న సీసీటీవీ దృశ్యాలు లభ్యమయ్యాయి. అక్టోబర్ 18 నాటి ఈ సీసీటీవీ దృశ్యాల్లో అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా శరీర భాగాలు ఉన్న ఓ బ్యాగుతో వెళ్తున్నట్టు తెలుస్తోంది. శ్రద్ధా వాకర్ శరీర భాగాలను పడేసి రావడం కోసమే అఫ్తాబ్ పూనావాల ఆ బ్యాగుతో బయటికొచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

అంతకంటే ముందుగా మే 18న శ్రద్ధా వాకర్‌ని హతమార్చిన అఫ్తాబ్.. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కత్తిరించి 300 లీటర్ల భారీ ఫ్రిడ్జ్‌లో ఆమె శరీర విడి భాగాలను నిల్వ చేసిన సంగతి తెలిసిందే. మూడు వారాల పాటు శ్రద్ధా శరీర భాగాలను ఫ్రిడ్జ్‌లోనే దాచిపెట్టిన అఫ్తాబ్.. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అర్ధరాత్రి దాటాకా ఆ శరీర భాగాలను బయటికి తీసుకెళ్లి నగరం నలుమూలలా డిస్పోజ్ చేయడం మొదలుపెట్టాడు. ఇండియా టుడె ప్రచురించిన ఓ కథనం ప్రకారం సీసీటీవీ ఫుటేజీలో అఫ్తాబ్ పూనావాలా చేతిలో ఓ బ్యాగుతో మూడు రౌండ్స్ వేస్తూ కనిపించినట్టు తెలుస్తోంది. అతడి చేతిలో ఉన్న బ్యాగ్ శ్రద్ధా వాకర్ శరీర భాగాలే అయ్యుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇదిలావుంటే, ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో అఫ్తాబ్ పూనావాలతో కలిసి శ్రద్ధా వాకర్ సహజీవనం చేసిన గదిలోంచి ఢిల్లీ పోలీసులు ఆమె దుస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణకు కీలకంగా మారేలా మరిన్ని ఆధారాలు ఏమైనా లభిస్తాయేమోననే ఆలోచనతో క్రైమ్, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ బృందాలు ఆ అద్దె ఇంటిని క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నాయి. శ్రద్ధా ఎముకలతో సరిపోల్చి చూసుకునేందుగాను ఆమె తండ్రి, సోదరుడి రక్త నమూనాలను సేకరించి డిఎన్ఏ ఎనాలసిస్‌కి పంపించారు. ఈ నివేదిక రావడానికి 15 రోజులు వ్యవధి పట్టే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. 

నేరం జరిగిన స్థలంలో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజెస్‌ని సైతం పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. ఆ డిజిటల్ పరికరాల్లో డేటాను పొందగలిగితే, కేసు దర్యాప్తునకు అవసరమైన కీలక సమాచారం లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.     

అఫ్తాబ్ పూనావాల చెప్పిన ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న పోలీసులు, దర్యాప్తు బృందాలు.. అతడి మాటలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు అస్థిపంజరం భాగాలు ఇప్పటికీ కనిపించకపోవడంతో పోలీసులు వాటి ఆచూకీని కనుగొనే పనిలో పడ్డారు. 

శ్రద్ధా శరీర భాగాలను వెలికితీయడంతో పాటు ఆమె శవాన్ని ముక్కలు చేసేందుకు ఉపయోగించిన ఆయుధం, ఆమె వస్తువులను సేకరించే పనిలో భాగంగా అఫ్తాబ్ పూనావాలాను బయటికి, అడవిలోకి తీసుకెళ్లినప్పుడు పోలీసులు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. నిందితుడి రక్షణ కోసం అదనపు బలగాలను మోహరించి దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడి సేఫ్టీ కోసం తరచుగా అత్యంత భద్రత మధ్య సౌత్ ఢిల్లీలోని పోలీసు స్టేషన్లు మారుస్తున్నారు. లాకప్‌లో ఉన్న అఫ్తాబ్ పూనావాలా కదలికలపై సైతం నిఘా పెట్టేలా అదనపు సిబ్బందిని లాకప్ వద్ద మోహరించారు.

Trending News