INCOIS: వావ్ సూపర్.. భూకంపం, సునామీ రాక ముందే గుర్తుపట్టవచ్చు.. అందుబాటులో సరికొత్త టెక్నాలజీ..

Delhi: సముద్రంలో అల్ల కల్లోలం ఎప్పుడు ఏర్పాడుతుందో ఎవరు చెప్పలేరు. అప్పటిక ప్రశాంతంగా ఉన్న సముద్రం.. ఒక్కసారిగా తన భయంకర అలలతో విరుచుకుపడుతుంది. బలంగా ఎగిసిపడుతూ.. ఒడ్డువైపుకు దూసుకు వచ్చి మనుషులను, ఇళ్లను అమాంతం తనతో పాటు సముద్రంలోకి లాక్కెళ్తుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 19, 2024, 04:24 PM IST
  • - సునామీ, భూకంపం కంటే ముందే అలర్ట్ అవ్వోచ్చు..
    - సరికొత్త టెక్నాలజీ కనిపెట్టిన సైంటిస్టులు..
INCOIS: వావ్ సూపర్.. భూకంపం, సునామీ రాక ముందే గుర్తుపట్టవచ్చు.. అందుబాటులో సరికొత్త టెక్నాలజీ..

EarthQuake And Tsunami Alert: మన టెక్నాలజీ రోజురోజుకు ఎంతో డెవలప్ అవుతుంది. అనేక రంగంలో వినూత్నమైన మార్పులు, ఆవిష్కరణలు మనంకనుగొంటున్నాం. ఇప్పటికే చంద్రుడిపై కూడా భూమిని సైతం కొందరు బుక్ చేసుకున్నారు. అదే విధంగా కొన్ని విపత్తులు రాకముందు ఎలా అలర్ట్ అవ్వాలో కూడా కనుగొన్నారు. మనకు సునామీ జీవితంలో మర్చిపోలేని విధంగా పాఠాన్ని నేర్పింది.

Read More: Haircare Tips: ఒత్తైన మందపాటి జుట్టు కావాలా? షహనాజ్ హుస్సేన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి..

ఇప్పటికి కూడా సునామిని తలుచుకొవడానికి చాలా మంది భయంతో వణికిపోతుంటారు. భయంకరమైన అలలు బలంగా వచ్చి, అప్పటి దాక ఒడ్డున పిల్లలు, కొందరు సముద్రం తీరంలో ఎంజాయ్ చేస్తున్న వారంతా రాకాసీ అలల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయారు. వేలాది ఇళ్లు కూడా ధ్వంసమైపోయాయి. మూగజీవాలు కూడా చాలా వరకు చనిపోయాయి. ఎందరో అమాయకులు నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి ఇలాంటి విపత్తులు కల్గే ముందు అలర్ట్ అయ్యేలా ఏదైన రూపొందిచాలని సైంటిస్టులు ఎంతో ప్రయత్నాలు చేపట్టారు.

తాజాగా.. మన సైంటిస్టులు.. స్వదేశీ సినాప్స్ వ్యవస్థను రూపొందించారు. ఇది సముద్రంలో సంభవించే భూకంపం, సునామీ సంకేతాలను గంట ముందుగానే ఇస్తుంది. దీంతో మనం అప్రమత్తమై నష్టాన్ని చాలా వరకు తగ్గించుకొవచ్చని అంటున్నారు. సైంటిస్టుల ప్రకారం.. భూమిపై ఉన్న అన్ని మహాసముద్రాలలో, అనేక కిలోమీటర్ల దిగువన జరిగే ప్రతి కదలిక ఇప్పుడు నిమిషాల్లో తెలిసిపోతుంది.

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOS) దేశం యొక్క మొట్టమొదటి సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సర్వీస్ (SYNOPS) ల్యాబ్‌ను రూపొందించింది. సముద్రాల్లో భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలను గంట ముందుగానే ఇది ఇస్తుంది. తుఫాను, రాక గురించి సమాచారం మూడు-నాలుగు రోజుల ముందుగానే అందుబాటులో ఉంటుంది.

మరో గొప్ప విషయం ఏమిటంటే, భారతీయ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సమాచారం కోసం అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన వ్యవస్థ Synops. ఈ వ్యవస్థ మత్స్యకారులకు ఏ దిశలో ఎక్కువ చేపలు ఉండవచ్చో కూడా తెలియజేస్తుంది. ఈ ల్యాబ్ మాల్దీవులు,  శ్రీలంక వంటి దేశాలకు కూడా సహాయం చేస్తుంది.

Read More: Sreemukhi: వాలుజడతో కవ్విస్తోన్న శ్రీముఖి.. బిగ్‌బాస్ బ్యూటీ యవ్వారం మాములుగా లేవుగా.

సినాప్స్ నుండి అందిన సమాచారాన్ని విపత్తు నిర్వహణ బృందానికి అందజేస్తామని, తద్వారా సరైన సమయంలో రెస్క్యూ ప్రారంభించవచ్చని INQUIS డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ తుమ్మల చెప్పారు. ప్రస్తుతం, సునామీ, తుఫాను, భూకంపం మొదలైన వాటిపై నిఘా ఉంచడానికి,  అంతర్జాతీయ సంస్థల నుండి సహాయం తీసుకుంటాము. ఈ ల్యాబ్ పూర్తిగా అధునాతన సెన్సార్‌లపై ఆధారపడి ఉంటుంది. సముద్రం లోపల ఏదైనా ప్రత్యేక కదలిక సెకను కంటే తక్కువ సమయంలో గుర్తించబడుతుంది.. అంతే కాకుండా.. ఖచ్చితమైన అంచనాలు ల్యాబ్‌కు పంపబడతాయి. వీటిని సైంటిస్టులు అంచనా వేసిన తర్వాత హెచ్చరికలు జారీ చేయబడుతాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News