Ramdev Baba: అల్లోపతి వర్సెస్ రాందేవ్ వివాదం ముదురుతోంది. రాందేవ్ బాబా వ్యాఖ్యలపై విచారణ ప్రారంభమైంది. ఢిల్లీ హైకోర్టు యోగా గురువు రాందేవ్ బాబాకు సమన్లు జారీ చేసింది.
పతంజలి సంస్థ ఛైర్మన్, యోగా గురువు రాందేవ్ బాబా(Ramdev Baba)కు కష్టాలెదురవుతున్నాయి. అల్లోపతి వైద్యవిధానంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అల్లోపతి వైద్యం వల్లనే కరోనా కారణంగా చాలామంది ప్రాణాలు పోయాయంటూ రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఐఎంఏ ఆగ్రహానికి దారి తీశాయి. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఆయనపై పరువు నష్టం దావా దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు రాందేవ్ బాబాకు సమన్లు జారీ చేసింది. విచారణను జూలై 13వ తేదీకు వాయిదా వేసింది.
విచారణ ముగిసేవరకూ ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. కోరోనిల్ టాబ్లెట్‌పై రాందేవ్ బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ ఐఎంఏ దావా వేసింది. కోరోనిల్‌తో కరోనా తగ్గుతుందా లేదా అనేది నిపుణులు తేల్చాలని..కోరోనిల్కు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఐఎంఏ పేర్కొంది. అల్లోపతి వైద్యంపై తప్పుడు, అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ రాందేవ్ బాబాపై ఐఎంఏ(IMA) పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమోదయోగ్యమైన పద్ధతిలో కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స, మందులపై తరచూ నిరాధార, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఐఎంఏ తెలిపింది.
Also read: Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్‌కు బలైన వైద్యుల సంఖ్య 624
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook