COVID-19: దేశంలో కరోనా ఉగ్రరూపం

భారత్‌లో కరోనా వైరస్ ( Coronavirus ) మహమ్మరి రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. 

Last Updated : Jul 23, 2020, 11:34 AM IST
COVID-19: దేశంలో కరోనా ఉగ్రరూపం

Corona cases: ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మరి రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 45,720 కొత్త కరోనా కేసులు  ( Corona cases ) నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 12,38,635కి చేరింది.  Actress Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య

గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 685 మంది మరణించారు. అయితే తమిళనాడులో కరోనా సోకి మరణించిన వారి సంఖ్యను ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సవరించింది. దీంతో అదనంగా మరో 444 మరణాలు చేరడంతో.. నిన్న ఒక్కరోజే కరోనా మరణాల సంఖ్య 1,129 గా నమోదుచేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 29,861కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. Also read: COVID-19: అప్పటి వరకు వ్యాక్సిన్‌ ఆశించొద్దు: WHO

ప్రస్తుతం దేశంలో 4,26,167 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7,82,606 మంది డిశ్చార్జ్ అయ్యారు.  బుధవారం దేశవ్యాప్తంగా 3,50,823 శాంపిళ్లను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కోటి 50 లక్షల 75వేలకుపైగా కరోనా పరీక్షలు చేసినట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనా రికవరీ రేటు 63.13శాతంగా ఉండగా.. మరణాల రేటు 2.41శాతంగా ఉంది. Also read: COVID19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై రష్యా శుభవార్త

Trending News