Covid-19 positive cases in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. నిరంతరం 60వేలకుపైగా కేసులు, వేయి మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. మంగళవారం దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 64,531 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1092 మంది బాధితులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ( Health Ministry ) బుధవారం వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 27,67,274కు పెరగగా.. మరణాల సంఖ్య 52,889కి
చేరుకుంది. Also read: Leopard: గుడిసెలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత
ప్రస్తుతం దేశంలో 6,76,514 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఇప్పటివరకు 20,37,871 మంది బాధితులు కోలుకున్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. నిన్న 8,01,518 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) తెలిపింది. ఇప్పటివరకు దేశంలో
3,17,42,782 COVID-19 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. Also read: Healh Tips: పరిగడుపున వెల్లుల్లి తినడం వల్ల లాభాలు తెలుసా..?