Corona Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ చేసిన ప్రకటన ఊరటనిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ దేశంలో మిగిల్చిన చేదు అనుభవం ఇంకా మర్చిపోలేదు. ప్రతి కుటుంబం నుంచి నా అనుకున్నవాళ్లు దూరమైన పరిస్థితి. అందుకే కరోనా థర్డ్‌వేవ్ దేశాన్ని తాకిందని తెలియగానే మళ్లీ కలకలం రేగింది. అటు దేశంలో కరోనా కొత్త కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ చేసిన ప్రకటన ఊరట కల్గిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో పోలిస్తే..థర్డ్‌వేవ్ కారణంగా మరణాలు గానీ, ఆసుపత్రుల్లో చేరిన ఘటనలు గానీ తక్కువేనని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా..వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకోవడంతో కరోనా ప్రభావం తక్కువగా ఉంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) తెలిపింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్‌వేవ్స్‌ను పోల్చి చెప్పే కీలక సూచీల్ని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రదర్శించారు.
దేశంలో 2021 ఏప్రిల్ చివరి నాటికి 3.86 లక్షల కొత్త కేసులు , 3 వేల 59 మరణాలు, 31.70 లక్షల కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటికి దేశంలో వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య మొత్తం జనాభాలో 2 శాతమే. అయితే 2022 జనవరి 20 నాటికి దేశంలో 3.17 కొత్త కేసులు, 380 మరణాలు, 19 లక్షల కరోనా యాక్టివా్ కేసులు నమోదయ్యాయి. ఇటు రెండుడోసులు పూర్తిగా తీసుకున్నవారి సంఖ్య 72 శాతంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ వల్ల దేశంలో మరణాలు తగ్గిపోయాయన్నారు. 18 ఏళ్లకు పైబడినవారిలో 72 శాతం రెండు డోసులు తీసుకోగా, 94 శాతం మంది తొలిడోసు తీసుకున్నారు. ఇక 15-18 ఏళ్ల కేటగరీలో 52 శాతం తొలిడోసు తీసుకున్నారు. ఈ కేటగరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap Government) టాప్‌లో ఉందన్నారు.
Also read: TV Debate Woman Dance: టీవీ డిబేట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. ఓ మహిళ అందరి ముందే.. (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook