Lok Sabha Elections 2024: నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే చికెన్, మటన్ బంద్.. పెరుగన్నమే గతి..

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ నేపథ్యంలో పాలక పార్టీలు ప్రత్యక్ష పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆరోగపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 3, 2024, 11:02 AM IST
Lok Sabha Elections 2024: నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే చికెన్, మటన్ బంద్.. పెరుగన్నమే గతి..

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ నేపథ్యంలో పాలక పార్టీలు ప్రత్యక్ష పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆరోగపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే డీఎంకే నేత ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్లీ మోడీని గెలిపిస్తే మనకు చికెన్, మటన్ బ్యాన్ చేస్తారు. ఇక పెరుగున్న సాంబర్ మాత్రమే గతి అన్నారు. ఈ 
ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడు లోక్‌ సభ ఎన్నికలు ఈనెల 19న జరగునున్న నేపథ్యంలో ప్రచారంలో డీఎంకే నేత ఒకరు ఈ విధంగా మోడీపై తీవ్రవిమర్శలు చేశారు.

ఇదీ చదవండి: తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం, సునామీ హెచ్చరిక, భారీ ప్రాణనష్టం
ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఈసందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.గతంలో కూడా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి సైతం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మరో సారి డీఎంకే నేత ఇలాంటి విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఇదీ చదవండి: రాజ్యసభలో ముగిసిన మన్మోహన్ శకం.. 33 యేళ్ల అనుబంధాని నేటితో తెర..

పీఎం నరేంద్ర మోడీ సైతం ఎన్నికల దృష్ట్యా తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించారు. లోక్ సభ ఎన్నికలు ఆసన్నమవుతున్న సందర్భంగా పలుమార్లు పీఎం మోడీ తమిళనాడులో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఎప్పటికప్పుడు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈనేపథ్యంలో తమిళనాడు అధికారిక పార్టీ అయినా డీఎంకే ప్రభుత్వం కూడా బీజేపీని తీవ్రంగా ఖండిస్తున్నారు.

 

గట్టి కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ పీఎం నరేంద్ర మోడీ గెలిస్తే మన ఆహారంపై కఠిన ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక గత ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి 39 ఎంపీ సీట్లను కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం కూడా అలాగే కలిసి కట్టుగా వెళ్లాలని ఆలోచిస్తున్నాయి. అయితే, గతం కంటే కూడా ప్రస్తుతం తమిళనాడుతో బీజీపీ సైతం బలపడింది. తమిళనాడులో ఈ నెల అంటే ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహించనున్నారు మొత్తం 39 లోక్‌ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించునున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News