CBSE Board Exams Time Table: సీబీఎస్ఇ 10,12 తరగతుల బోర్డు పరీక్షలు ఎప్పుడంటే, టైమ్ టేబుల్ విడుదల

CBSE Board Exams Time Table: సీబీఎస్ఇ బోర్డ్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. 2025 విద్యా సంవత్సరంలో పది, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. పదవ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయో చ్దూదాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2024, 01:39 PM IST
CBSE Board Exams Time Table: సీబీఎస్ఇ 10,12 తరగతుల బోర్డు పరీక్షలు ఎప్పుడంటే, టైమ్ టేబుల్ విడుదల

CBSE Board Exams Time Table: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ 2024-25 విద్యా సంవత్సరపు 10, 12 తరగతుల  బోర్డ్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 18 వరకు జరగనుండగా 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరుగుతాయి. ఏ పరీక్ష ఎప్పుడు జరగనుందో చెక్ చేద్దాం.

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12 తరగతి సీబీఎస్ఇ బోర్డు పరీక్షల షెఢ్యూల్ విడుదలైంది. పరీక్షలకు దాదాపు మూడు నెలల ముందే టైమ్ టేబుల్ విడుదల కావడం గమనార్హం. గత ఏడాది కంటే ముందే ఈసారి టైమ్ టేబుల్ ప్రకటించింది సీబీఎస్ఇ బోర్డు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 18 వరకు జరగనుండగా, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరుగుతాయి. 

సీబీఎస్ఇ 10వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ 2025

ఫిబ్రవరి 15 ఉదయం 10.30 గంటల నుంచి 1.30 వరకు ఇంగ్లీషు
ఫిబ్రవరి 17 ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు హిందూస్తానీ మ్యూజిక్
ఫిబ్రవరి 18  ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఫైనాన్షియల్ మార్కెట్ 
ఫిబ్రవరి 20 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు సైన్స్
ఫిబ్రవరి 22 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు ఫ్రెంచ్, సంస్కృతం
ఫిబ్రవరి 25 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు సోషల్ సైన్స్
ఫిబ్రవరి 27 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు ఉర్దూ, బెంగాలీ,తమిళం, మరాఠీ, గుజరాతీ, మణిపూరి
ఫిబ్రవరి 28 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు హిందీ
మార్చ్ 1 ఉదయం 10.30 నుంచి 12.30 వరకు పెయింటింగ్
మార్చ్ 3 ఉదయం 10.30 నుంచి 12.30 వరకు హెల్త్ కేర్
మార్చ్ 5 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు బిజినెస్
మార్చ్ 6 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు టిబెటన్, జర్మన్, ఎన్‌సిసి, తెలుగు, జపానీస్, స్పానిష్
మార్చ్ 10 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు మేథ్స్
మార్చ్ 12 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు తెలుగు, అరబిక్, రష్యన్, పర్షియన్, నేపాలీ
మార్చ్ 13 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు హోమ్ సైన్స్
మార్చ్ 17 ఉదయం 10.30 నుంచి 1.30 వరకు పంజాబీ, సింధి, మలయాళం, కన్నడ
మార్చ్ 18 ఉదయం 10.30 నుంచి 12.30 వరకు కంప్యూటర్స్, ఐటీ, ఏఐ

12వ తరగతి సీబీఎస్ఇ బోర్డ్ పరీక్షలు 2025 టైమ్ టేబుల్

ఫిబ్రవరి 15 ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్
ఫిబర్రవి 17 ఫిజికల్ ఎడ్యుకేషన్
ఫిబ్రవరి 18 హిందూస్తానీ సంగీతం
ఫిబ్రవరి 19 పుడ్ ప్రొడక్షన్
ఫిబ్రవరి 20 కంప్యూటర్స్
ఫిబ్రవరి 21 ఫిజిక్స్
ఫిబ్రవరి 22 బిజినెస్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
ఫిబ్రవరి 24 జియోగ్రఫీ
ఫిబ్రవరి 25 ఫ్రెంచ్, ట్యాక్సేషన్, టెక్స్‌టైల్ డిజైన్, ఏఐ
ఫిబ్రవరి 27 కెమిస్ట్రీ
ఫిబ్రవరి 28 ఫైనాన్షియల్ మార్కెట్స్, బ్యూటీ అండ్ వెల్‌నెస్
మార్చ్ 1 ఇంజనీరింగ్ గ్రాఫిక్స్
మార్చ్ 3 లీగల్ స్టడీస్
మార్చ్ 4 ఎన్‌సిసి, బ్యాంకింగ్
మార్చ్ 5 అగ్రికల్చర్, మార్కెటింగ్
మార్చ్ 6 ఫ్యాషన్ స్టడీస్
మార్చ్ 7 మాస్ మీడియా స్టడీస్
మార్చ్ 8 మేథ్స్
మార్చ్ 10 టూరిజం, ఏసీ రిఫ్రిజిరేషన్
మార్చ్ 11 ఇంగ్లీషు
మార్చ్ 12 యోగా, ఫిజికల్ యాక్టివిటీ
మార్చ్ 13 వెబ్ అప్లికేషన్
మార్చ్ 15 హిందీ
మార్చ్ 17 ఉర్దూ, సంస్కృతం, కర్నాటక సంగీతం
మార్చ్ 18 పెయింటింగ్
మార్చ్ 19 ఎకనామిక్స్
మార్చ్ 21 బయోటెక్నాలజీ
మార్చ్ 22 పొలిటికల్ సైన్స్
మార్చ్ 25 బయోలజీ
మార్చ్ 26 ఎక్కౌంటెన్సీ
మార్చ్ 27 సోషియాలజీ
ఏప్రిల్ 1 హిస్టరీ
ఏప్రిల్ 3 హోమ్ సైన్స్
ఏప్రిల్ 4 సైకాలజీ

Also read: Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News