CAPF Constable Exam: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో సీఏపీఎఫ్‌ పరీక్ష!

MHA to conduct of Constable examination for CAPFs in 13 regional languages form 2024. కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్‌) పరీక్షను 13 ప్రాంతీయ భాషలలో కూడా నిర్వహించనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 15, 2023, 01:30 PM IST
  • కేంద్ర ప్రభుత్వ మరో కీలక నిర్ణయం
  • 13 ప్రాంతీయ భాషలలో సీఏపీఎఫ్‌ పరీక్ష
  • ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి
CAPF Constable Exam: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో సీఏపీఎఫ్‌ పరీక్ష!

MHA to conduct CAPF Constable exams in 13 regional languages from 2024: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్‌) పరీక్షను ప్రాంతీయ భాషలలో కూడా నిర్వహించనుంది. 2024 జనవరి 1 నుంచి హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో పరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. సీఏపీఎఫ్‌లో స్థానిక యువత పాల్గొనడానికి, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

వచ్చే ఏడాది నుంచి హిందీ మరియు ఇంగ్లీషుతో పాటు సీఏపీఎఫ్‌ కానిస్టేబుల్ (CAPF Constable Exam) ప్రశ్నపత్రం 13 ప్రాంతీయ భాషలలో వస్తుంది. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి మరియు కొంకణి భాషలతో పాటు హిందీ, ఇంగ్లీషు భాషల్లో సీఏపీఎఫ్‌ ప్రశ్నపత్రం రానుంది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని లక్షలాది మంది అభ్యర్థులు తమ మాతృభాష/ప్రాంతీయ భాషలో పరీక్ష రాసుకునే వీలుంటుంది. దాంతో వారి ఎంపిక అవకాశాలు కూడా మెరుగుపడతాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులను ఆకర్షిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధాన పరీక్షల్లో కానిస్టేబుల్ జీడీ ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన యువత కేంద్రంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రాంతీయ భాషలు ఇవే (13 Regional Languages):
# అస్సామీ
# బెంగాలీ
# గుజరాతీ
# మరాఠీ
# మలయాళం
# కన్నడ
# తమిళం
# తెలుగు
# ఒడియా
# ఉర్దూ
# పంజాబీ
# మణిపురి
# కొంకణి

Also Read: Tata Nexon Vs Maruti Fronx: టాటా నెక్సాన్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మారుతి ఫ్రాంక్స్‌లో లేవు.. కొనేప్పుడు ఇవి చూసుకోండి!

Also Read: Mahindra Thar Price Hike 2023: మహీంద్రా థార్ కొనేవారికి షాక్.. ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన ధర!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News