భాంగ్రా స్టెప్పేసిన కెనడా ప్రధాని జస్టిన్.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియో

Last Updated : Feb 24, 2018, 01:01 AM IST
భాంగ్రా స్టెప్పేసిన కెనడా ప్రధాని జస్టిన్.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియో

ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం రాత్రి ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు తన భార్య సోఫితో కలిసి  హైదరాబాద్ హౌజ్‌కి చేరుకున్న జస్టిన్ ట్రూడో అక్కడ భాంగ్రా సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ డిన్నర్ పార్టీలో డోలు వాయిద్యాలకు అనుగుణంగా జస్టిన్ ట్రూడో స్టెప్పేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వేషధారణలోనూ సంప్రదాయం ఉట్టిపడేలా నల్ల రంగు షేర్వానీ ధరించి ఈ విందుకు హాజరైన జస్టిన్ ట్రూడోకు భాంగ్రా వాయిద్యకారులు స్వాగతం పలికారు. భాంగ్రా డోలు వాయిద్యాలు వినడంతో జస్టిన్‌కి సైతం మంచి ఊపొచ్చిందేమో.. వెంటనే భాంగ్రా స్టైల్లో స్టెప్పేయడం మొదలుపెట్టారు. ఈ ఈవెంట్ కవరేజ్‌కి వెళ్లిన ఓ జర్నలిస్ట్ రికార్డ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో నెటిజెన్స్‌ ని అలరిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి!! 

 

Trending News