బడ్జెట్ 2018: రైల్వేశాఖకు లక్షా 48వేల కోట్లు కేటాయింపు

రైల్వే బడ్జెట్ :1,48,528 కోట్లు- రైల్వే ఆధునీకరణకు పెద్దపీట

Last Updated : Feb 1, 2018, 04:25 PM IST
బడ్జెట్ 2018: రైల్వేశాఖకు లక్షా 48వేల కోట్లు కేటాయింపు

రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో సీసీటీవీ కెమరాలను దశలవారిగా చేపట్టుతామని.. అలాగే  స్టేషన్, రైళ్లలో వైఫై సేవలను క్రమక్రమంగా విస్తరిస్తామని చెప్పారు. సాధారణ బడ్జెట్ లో భాగంగా రైల్వే శాఖకు కేటాయింపులు చేశారు.

* రైల్వే బడ్జెట్ :1,48,528 కోట్లు

* దేశవ్యాప్తంగా 600 ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి

* 18 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డబ్లింగ్

* ముంబై అర్బన్ రైల్వే వ్యవస్థ ఆధునీకరణకు రూ.లక్ష కోట్లు, ముంబై రవాణా వ్యవస్థ విస్తరణ

* బెంగుళూరు కోసం 160 కిలోమీటర్ల సబర్బన్ నెట్వర్క్ ప్రణాళిక

* 40వేల కోట్ల రూపాయలతో దేశంలో 150 కిలోమీటర్ల సబర్బన్ రైల్వేనెట్ వర్క్ నిర్మాణం

* 3,600 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఆధునీకరణ

* గుజరాత్ లోని వడోదరాలో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థ వస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

Trending News