Droupadi Murmu: విపక్ష కూటమికి బిగ్ షాక్.. ద్రౌపదీ ముర్ముకు మాయావతి సపోర్ట్

Droupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలలో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము బలం రోజురోజుకు పెరిగిపోతోంది. విపక్షాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. తాజాగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు బహుజన సమాజ్ పార్టీ సపోర్ట్ చేసింది. గిరిజన నేత ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు.

Written by - Srisailam | Last Updated : Jun 25, 2022, 02:44 PM IST
  • రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్
  • ద్రౌపదీ ముర్ముకు మాయావతి మద్దతు
  • 60 శాతానికిపైగా ఓట్లు వస్తాయంటున్న బీజేపీ
Droupadi Murmu: విపక్ష కూటమికి బిగ్ షాక్.. ద్రౌపదీ ముర్ముకు మాయావతి సపోర్ట్

Droupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలలో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము బలం రోజురోజుకు పెరిగిపోతోంది. విపక్షాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. తాజాగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు బహుజన సమాజ్ పార్టీ సపోర్ట్ చేసింది. గిరిజన నేత ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. బీజేపీకి మద్దతుగానే, విపక్ష కూటమికి వ్యతిరేకంగానో  తాము ఈ నిర్ణయం తీసుకోలేదని మాయావతి క్లారిటీ ఇచ్చారు. గిరిజన తెగకు చెందిన అభ్యర్థి తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున మద్దతు ఇవ్వాలని బీఎస్పీ నిర్ణయించిందని తెలిపారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో  విపక్ష కూటమి బీఎస్పీని సంప్రందించలేదని మయావతి వెల్లడించారు. ఎంపిక చేసుకున్న కొన్ని పార్టీలనే పిలిచారని ఆమె మండిపడ్డారు. శరద్‌ పవార్‌ కూడా తనతో మాట్లాడలేదని మయావతి వివరించారు. దేశంలో దళితుల నాయకత్వంలో ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ అని మాయావతి చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు కాకుండా అణగారిన వర్గాల కోసం పనిచేస్తామన్నారు. ఆ వర్గాల  ఎప్పుడూ అండగా ఉంటామన్నారు మాయావతి.

ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు కావాల్సిన మెజార్టీ ఉంది. ఎన్డీఏ కూటమికి 48.6 శాతం ఓట్లు ఉండగా.. ద్రౌపది ముర్ముకు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఒడిషా రూలింగ్ పార్టీ బీజూ జనతాదళ్ మద్దతు ప్రకటించాయి. ఈ రెండు పార్టీలకు దాదాపు 6 శాతం ఓట్లున్నాయి. దీంతో ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి బలం 55 శాతం దాటి పోయింది. యూపీఏ కూటమిలో ఉన్న జేఎంఎం పార్టీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో అధికారంలో ఉంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు సపోర్ట్ చేయనున్నారని తెలుస్తోంది. శివసేన రెబెల్ కూటమిలో 50 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు ఉన్నారని తెలుస్తోంది.

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం నామినేషన్‌ వేశారు. కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులులతో బీజేపీ అగ్ర నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్జీఏలో లేకున్నా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన వైసీపీ నేతలు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల నాటికి తమ బలం మరింతగా పెరుగుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ద్రౌపది ముర్ముకు 60 శాతానికిపైగా ఓట్లు వస్తాయని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చెప్పారు. తొలిసారి గిరిజన మహిళ దేశ అత్యున్నత పదవికి పోటీ పడుతున్నందున... విపక్ష పార్టీల్లోని బడుగు, బలహీన వర్గాల ప్రజా ప్రతినిధులు ముర్ముకు అండగా ఉండే అవకాశం ఉందన్నారు భూపేందర్‌ యాదవ్‌.

Read also: AP Govt: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..పే స్కేల్‌ ఫిక్స్ చేసిన ప్రభుత్వం..!

Read also: Amit sha :19 ఏళ్ల పాటు మోడీ నరకయాతన! తన ఆప్త మిత్రుడి బాధను చెప్పిన అమిత్ షా.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News