Flight Bomb Threat: చెన్నై ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు హైటెన్షన్ కు దారితీసింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో తన వద్ద బాంబు ఉందని పేల్చేస్తామని ఓ ప్రయాణికుడు బెదిరించడంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళన గురయ్యారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. అయితే చెన్నై ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని నిర్ధారించుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
పూర్తి వివరాల్లోకెళ్తే చెన్నైకి కొచ్చి నుంచి 171 మంది ప్రయాణికులతో శనివారం అర్ధరాత్రి ఇండిగో ఎయిర్ లైన్స్ ఫ్లైట్ బయలుదేరింది. టేకాఫ్ అయినా కొద్దిసేపటికే ఫ్లైట్లో అమెరికా, కేరళ చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు .దీంతో ఓ వ్యక్తి తన దగ్గర బాంబు ఉందని పేల్చేస్తానంటూ బెదిరించాడు.
Also Read: PM Modi: గణతంత్ర వేడుకలు .. స్పెషల్ అట్రాక్షన్ గా ప్రధాని మోదీ తలపాగా
ఇదంతా గమనించిన తోటి ప్రయాణికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలేట్స్ ఈ విషయాన్ని చెన్నై ఎయిర్ పోర్టులోని భద్రతా అధికారులకు తెలియజేశారు. చెన్నై ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం ఐదు గంటల ప్రాంతానికి తనిఖీలు పూర్తి చేసిన భద్రతా అధికారులు బాంబు లేదని తేల్చారు. కాగా ప్రయాణికులను భయాందోళన గురిచేసిన అమెరికా, కేరళ ప్రయాణికులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook