Bharat Bandh - Delhi Chalo farmers protest: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 13 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కూడా చాలా రాష్ట్రాల్లో విజయవంతం అయింది. ఈ బంద్‌కు అన్ని ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతునిచ్చాయి. ఈ క్రమంలో రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ).. రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. భారత్ బంద్ ముగిసిన నేపథ్యంలో సింఘు బోర్డర్ నుంచి అమిత్ షాను కలిసేందుకు వెళ్లనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిథి రాకేశ్ తికాయత్ తెలిపారు.
ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారని చెప్పారు. తాము సింఘు బోర్డర్‌కు వెళ్తున్నామని, అక్కడి నుంచి రైతు నేతలతో కలిసి అమిత్ షాతో సమావేశానికి వెళ్తామని తెలిపారు. Also read: Bharat Bandh: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధం
ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దుకు చేరుకుని 13 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య ఐదు సార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయ. బంద్ తర్వాత 9వ తేదీన మరోసారి చర్చలు జరుగుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికిముందే హోంమంత్రి అమిత్‌షా రైతు సంఘాల నాయకుల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన్యం సంతరించుకుంది. Also read: Bharat Bandh: తెలంగాణలో కొనసాగుతున్న భారత్ బంద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Farmer protests: కాసేపట్లో రైతు సంఘాలతో భేటీ కానున్న అమిత్ షా